Nerves : అసలు నరుల దిష్టి ఎందుకు తగులుతుంది. నరుల దిష్టి వల్ల ఎన్నో నష్టాలు కలుగుతాయని మన పూర్వీకుల నుంచే మన పెద్దలు వరకు అందరూ చెబుతూనే ఉన్నారు. అయితే ఇంతకు దిష్టి అంటే ఏమిటి అనే విషయం గురించి చూద్దాం.. మానవ శరీరంలో నుంచి ప్రతికూల అణు శక్తిని విడుదల చేసే అవయవాలు చాలానే ఉంటాయట. అందులో ముఖ్యమైనవి కళ్ళు. ఇవి మన చుట్టూ ఉండే భయాలను గ్రహించి మన మెదడుకు చేరవేస్తాయి
అలా చూసిన విషయాలను తిరిగి మన మెదడు ద్వారా కళ్ల ద్వారా తెలిపే ప్రభావం మన కళ్ళకు ఉంటుందట. ఏదైనా వస్తువును చూసినప్పుడు మన కంటి నుంచి వెళ్లే ప్రతికూల శక్తి.. వ్యక్తి మీద చూపడం వల్ల దీని ప్రభావం చాలా ఉంటుందట. ఇలాంటి దానినే దిష్టి అంటారు. అయితే ఇలాంటి దిష్టి తగిలితే.. ఆ ఇంట్లో ఎన్నో సమస్యలతో పాటు, చాలా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయట. అయితే దీనికోసం కేవలం పండితులు మాత్రమే సంప్రదించి నరఘోష యంత్రాన్ని ధరించవలసిన ఉంటుంది. ఆ యంత్రానికి తగిన పూజ చేయించి ఆ యంత్రాన్ని మన ఇంట్లోనే ఎంతో జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ముఖ్యంగా యంత్రానికి పూజ చేయించకుండా మన ఇంట్లో ఉంచుకున్నా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా కచ్చితంగా వారంలో ఒక్కరోజైనా ఆ యంత్రం దగ్గర అగరబత్తి అయిన వెలిగిస్తూ ఉండాలి. దీనివల్ల ఆ యంత్రం శక్తి రెట్టింపయ్యి.. నరదృష్టి నుంచి విముక్తి కలుగుతుంది. ఇక అంతే కాకుండా ఇక రాబోయే నరదిష్టి దోషాలను రాకుండా ఆ యంత్రం అడ్డుపడుతుంది. అయితే కొంత మంది మాత్రం గుమ్మడి కాయలు కడుతూ ఉంటారు. ఇక మరి కొంతమంది అయితే నవధాన్యాల తో పాటుగా పసుపు బట్టలో చుట్టి అందులో చెట్టు మీద కొబ్బరికాయను ఉంచి.. మూట కట్టి ఏదైనా ఎత్తైన ప్రదేశంలో గుమ్మం దగ్గర కడతారు. ఇక వీటికి తోడుగా నిమ్మకాయలు, మిరపకాయలు వంటివి కూడా కడుతూ ఉంటారు. ఇలాంటివి చేయడం వల్ల నరదిష్టి నుంచి విముక్తి పొందవచ్చు