Saraswathi Plant : సరస్వతి మొక్కలో మన ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో సుగుణాలు పుష్కళంగా లభిస్తాయి. ఇప్పుడు ఈ మొక్క ఎదురుగా ఉన్నా కూడా చాలా మంది గుర్తించలేకపోవచ్చు. ఈ మొక్క ఆకు వల్ల ప్రయోజనాలు తెలిస్తే, కచ్చితంగా వాడి తీరుతారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఆయుర్వేదంలో ఈ మొక్కను బ్రహ్మి మొక్క అని, దీనికి వైద్య చికిత్సలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.దీనిని సాధారణంగా వాడుక భాషలో సరస్వతి మొక్క అని అంటారు. పూర్వం పిల్లల్లో తెలివి తేటలు, జ్ఞాపక శక్తి పెరగాలంటే బ్రహ్మి ఆకు తినాలని చెబుతూ ఉండేవారు. రోజూ నాలుగు బ్రహ్మి ఆకులను నమిలి తింటే మెదడు పనితీరు మెరుగవుతుందని సూచించేవారు. ప్రస్తుతం ప్రతి ఆయుర్వేద షాపుల్లో ఇది పొడి, టాబ్లెట్స్, లేహ్యం, తైలం.. ఇలా వివిధ రూపాల్లో ఈజీగా దొరుకుతుంది.ఈ మొక్కలను ఇంట్లోనే స్థలం ఉన్నవారు సులభంగా పెంచుకోవచ్చు.

సరస్వతి మొక్క ఆరోగ్య ప్రయోజనాలు అన్ని, ఇన్ని కాదు. వయసు పెరిగేకొలది మతిమరపు రావడంతో చాలా ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారికి బ్రహ్మి మొక్క దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అంతే కాక రోజూ రెండు సరస్వతి ఆకులు తినడం వల్ల చిన్న పిల్లల్లో తెలివితేటలు, ఏకాగ్రత , జ్ఞాపకశక్తి పెరుగుదలకు కారణమయ్యే మెదడులోని హిప్పోకాంపస్ భాగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
జాండిస్ తో బాధపడుతున్న వారికి ఈ మొక్క ఆకుల రసాన్ని తాగించడం వల్ల రక్త శుద్ధి జరిగి, జాండిస్ తొందరగా తగ్గుముఖము పడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తుంటారు. మధుమేహంతో బాధపడేవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి చాలా బాగా సహాయపడుతుంది.
రక్త హీనత సమస్యతో బాధపడేవారు రోజూ గోరువెచ్చని నీటిలో ఈ ఆకుల రసం వేసి త్రాగటం వల్ల రక్తకణాలు వృద్ధి చెంది,రక్త హీనతకు పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఈ ఆకు రసం జుట్టు సమస్యలకు కూడా పరిస్కారం చూపి,జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
అధిక బరువుతో బాధపడేవారు సరస్వతి ఆకుల రసంలో కాస్త వామును కలిపి మెత్తని పేస్టులా చేసుకుని తినడం వల్ల..అధిక కొలెస్ట్రాల్ ఈజీగా కరిగిపోతుంది.
గ్యాస్ట్రిక్ అల్సర్లను తగ్గించడానికి, ప్రేగు సిండ్రోమ్ కు అత్యంత ఉపయోగపడే ఔషధం బ్రహ్మి ఆకు.
ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఈ మొక్క ఆకుల్లో పుష్కళంగా ఉన్నాయి.