Coriander Benefits : సాధారణంగా కొత్తిమీరను ప్రతి ఒక్కరు వండిన వంటలపై గార్నిష్ కోసం మాత్రమే ఉపయోగిస్తారు అని అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే కొత్తిమీర తో ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉండడమే కాకుండా నిల్వ పచ్చడితో పాటూ ఇన్స్టంట్ పచ్చడిని కూడా చేసుకుంటూ ఉంటారు.. కొత్తిమీర వల్ల మనకు లభించే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తప్పకుండా ఆశ్చర్యపోవాల్సిందే.. ఎందుకంటే కొత్తిమీరలో ఖనిజ లవణాలు, విటమిన్లు , ఐరన్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలతో తయారుచేసే వంటలలో కొత్తిమీరను వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కొత్తిమీరను సహజంగా పండించిన దానినే ఎక్కువగా ఉపయోగించాలి..
మార్కెట్లో లభ్యమయ్యే కొత్తిమీరను శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించడం మంచిది.. ఎందుకంటే కొత్తిమీర ఎక్కువకాలం పచ్చగా ఉండడానికి మార్కెట్లో వ్యాపారులు సల్ఫర్ లిక్విడ్ ను స్ప్రే చేస్తారు..దీనివల్ల మనకు అనేక రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక సహజంగా పండించిన కొత్తిమీరను ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటే.. రక్త హీనత సమస్యను తగ్గిస్తుంది.. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును బయటకు పంపించడం లో సహాయపడుతుంది. రక్తనాళాల్లో ఏర్పడిన ఆటంకాలను తొలగించడానికి కొత్తిమీర చాలా బాగా పనిచేస్తుంది.. ఫుడ్ పాయిజనింగ్ చేసే చికిత్సలో అత్యంత ప్రయోజనకారిగా కొత్తిమీర పనిచేస్తుందని కొన్ని అధ్యయనాల ద్వారా వెల్లడయింది.

నోటి దుర్వాసన, నోటి పూత , చిగుళ్ల నుంచి రక్తం కారడం , చిగుళ్ల వాపు వంటి సమస్యలకు కొత్తిమీర ఆకులు చెక్ పెడతాయి. కొత్తిమీర ఆకులను నమిలి తింటూ ఉంటే ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. శరీరం అందంగా మెరవాలి అన్న కొత్తిమీర రసం చాలా బాగా పనిచేస్తుంది.. ఇక మొటిమలు, మంగు మచ్చలు, నల్లటి మచ్చలు, పొడి చర్మం వంటి చర్మ సంబంధిత సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. కొత్తిమీరను శుభ్రంగా కడిగి దాని నుంచి రసం తీసి.. ఆ రసంలో కొద్దిగా పసుపు వేసి ముఖానికి అప్లై చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి..అయితే ఈ ప్యాక్ ను నిద్రించే ముందు ముఖానికి అప్లై చేసి ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే చక్కటి ఫలితాలు లభిస్తాయి. ఇక విటమిన్ ఏ, విటమిన్ బి 6 ,విటమిన్ బి 1 , విటమిన్ సి వంటి విటమిన్ల లోపం తలెత్తకుండా ఉండాలంటే ప్రతిరోజూ పడుకునే ముందు కొత్తిమీర రసానికి కొద్దిగా తేనె కలిపి తాగుతూ వుంటే ఇలాంటి సమస్యలు దూరమవుతాయి.