Vastu Tips : కొంతమంది ఎంత కష్టపడినా సరే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలట్లేదు అని బాధపడుతూ ఉంటారు. మరికొంతమంది కష్టపడకపోయినా సరే వారికి ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు. అయితే నిత్యం కష్టపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు వాస్తు శాస్త్రం ప్రకారం ఏదైనా సమస్యలు ఉన్నాయేమో అని గుర్తించుకోవాలి. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో సామాన్లను సర్దుకుంటూ ఉంటాము. కానీ ఎప్పుడైతే వాస్తుకు విరుద్ధంగా ఇంట్లో ఉన్న సామాన్లను సర్దుతామో అప్పుడు ఆదాయం తగ్గుతుంది. ధన నష్టం కలుగుతుంది. పైగా ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు తగ్గిపోతాయి.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక సమస్యలను దూరం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఎప్పుడూ కూడా కాళీ బకెట్ ఉంచకూడదు. వీటివల్ల ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు బకెట్ నీళ్లను ఇంట్లో ఉంచడం లేదా బాత్రూంలో ఉన్న బకెట్లో నీటిలో నింపడం వంటివి చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఒకవేళ బాత్రూం బయట ఉన్నట్లయితే ఇంట్లో ఒక బకెట్ నీళ్లను ఉంచడం వల్ల లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లు అవుతుంది. కాబట్టి ఆర్థిక సమస్యలు దరి చేరవు.
అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపం పెట్టడం కూడా చాలా మంచిది.ఇంట్లో దీపం పెట్టడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా దీపం వెలుతురుకు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి వెళ్లిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. తద్వారా ఆ ఇల్లు సుఖసంతోషాలతో తులతూగుతుంది. ముఖ్యంగా ఇంట్లో దీపం పెట్టేటప్పుడు ఇంటి ముఖ ద్వారం దగ్గర దీపం వెలిగిస్తే కూడా చాలా మంచి కలుగుతుంది. అలాగే నిత్యం తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించి పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేశారంటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.