Health Tips : ఎక్కువగా బియ్యప్పిండితో ప్రతి ఒక్కరు ఎన్నో రకాల వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు.. అంతేకాకుండా ఎక్కువగా దోశ రూపంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఇటువంటి బియ్యంపిండితో ముఖాన్ని కూడా అందంగా తయారు చేసుకోవచ్చని ఈ విషయాన్ని కొంతమంది సౌందర్య నిపుణులు తెలియజేయడం జరిగింది. వాటి గురించి పూర్తిగా ఎలా చేయాలో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఒకదానిని మించి మరొకటి సౌందర్యాన్ని పెంపొందించే సాధనాలు ఎన్నో ఉన్నప్పటికీ.. ప్రతి ఒక్కరు ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్న
పదార్థం శెనగపిండి, బియ్యం పిండి అని చెప్పవచ్చు.. మన పూర్వీకులు అంతా ఎక్కువగా బియ్యం పిండితోనే ముఖాన్ని అందంగా మార్చుకోనే వారు.. అయితే ఈ మధ్యకాలంలో అందంగా తయారవడానికి ఎన్నో రకాల ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తున్నాయి.. కానీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం చాలానే ఉంది. కాబట్టి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని పక్కన పెట్టి మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతో ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.. కానీ మీరు చేయవలసిందల్లా కేవలం కాస్త సమయాన్ని కేటాయించడం మాత్రమే.బియ్యం పిండితో కూడా ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు..

అందుకోసం కేవలం బియ్యం పిండి, కాస్త పసుపు, నీళ్లు వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత దానిని ముఖానికి పట్టించాలి. అలా పట్టించిన తర్వాత కొద్ది నిమిషాలు కదలకుండా ఉంటే చర్మం మీద వుండే మృతకణాలు వెంటనే తొలగిపోతాయి.. దీంతో చర్మం చాలా అందంగా తయారవుతుంది. ఇక మరొక చిట్కా ఏమిటంటే.. మనకి బాగా దొరికేటువంటి పండు అరటి పండు.. దీనిని మెత్తగా చేసి, కాస్త తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకున్నట్లుయితే.. ముఖం పైన ఉండే చిన్న చిన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా దూరమవుతాయి