Heart Disease : అధిక బరువు,బీపీ ఉన్నవారికి ఎక్కువగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది . బ్లడ్ ప్రెసర్ ఎక్కువైనప్పుడు రక్తపోటు హెచ్చుతగ్గులు సమస్యలను కలిగిస్తాయి. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటి కోసం ఎన్నో రకాల ఇంగ్లీష్ మందులు వాడి దుస్ప్రభావాలు తెచ్చుకున్న వారున్నారు. కానీ సహజంగా, ఎలాంటి ఇతర సమస్యలు లేకుండా, గుండె జబ్బులను తగ్గించుకోవడానికి ఎన్నో ఆయుర్వేద చిట్కాలున్నాయి. అందులో భాగమే లెమన్ టీ. లెమన్ టీ ఎలా తయారుచేస్తారో, దాని వల్ల ఉపయోగాలెంటో ఇప్పుడు చూద్దాం..
లెమన్ గ్రాస్ ఇప్పుడు ఎక్కడైనా ఈజీ గా దొరుకుతుంది. ఈ లెమన్ గ్రాస్ తో టీ చేసి తరుచుగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ద్రవ రూపంలో అధిక మొత్తాదులో వున్న యాసిడ్స్ మన శరీరంలో ని సోడియం కంటెంట్‌తో పాటు చెడు కోలేష్ట్రాల్ ను కూడా బయటకు పంపుతుంది. శరీరంలో గ్యాస్ వల్ల కలిగే మంటను నివారిస్తుంది. దీని వల్ల అంతర్గతంగా ఎటువంటి దుష్ప్రభావాలు కలిగించదు.
బీపీ కంట్రోల్ లో ఉంచి శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికే కాక కిడ్నీ పని తీరును కూడా మెరుగుపరుస్తుంది. శరీరంలోని అధిక సోడియం ను మూత్రం రూపంలో బయటకు పంపిస్తుంది. దీని వల్ల కిడ్నీ లో స్టోన్స్ ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి.
ఇందులో గుండెకు కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, ఫ్రీ రాడికల్స్ ద్వారా ఏ భాగంలోనైనా కణం డ్యామేజిని రిపేర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది శరీరం ఆరోగ్యానికే కాక అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో వున్న యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు వల్ల వృద్యాప్య ఛాయలు తొందరగా రాకుండా కూడా నివారిస్తుంది.
లెమన్ గ్రాస్ తో టీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. లెమన్ గ్రాస్ టీ చేయడానికి, ఒక చిన్న పాత్రలో అర లీటరు నీరు పోసి మరిగించాలి.తర్వాత ఒక 10,15 రెమ్మలు లెమన్ గ్రాస్ తీసుకుని బాగా కడిగి మరిగే నీళ్లలో వేసి, 5 నిమిషాల పాటు మరిగించాలి. అవి గోరు వెచ్చగా మారిన తర్వాత అందులో కాస్త తేనె, నిమ్మరసం లేదా దాల్చిన చెక్క పొడి వేసి త్రాగాలి.ఇలా రోజూ త్రాగటం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది .