Womens: మహిళలు మరింత దృఢం గా మారాలంటే..?

Womens: ఇంటిపని.. వంటపని..ఉద్యోగం.. పిల్లలు అంటూ మహిళలు ఎన్నో పనులను రెండు చేతులతో చేస్తూ సతమతమవుతూ ఉంటారు. ఇక మహిళ లేని ఇల్లు ఇల్లు కాదని చెబుతారు పెద్దలు.. మహిళలు ఉదయం లేచి అన్ని పనులు తామే స్వయంగా చేసుకోవడమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి అందరి బాధ్యతలు తీసుకుని ముందు వరుసలో ఉండే మహిళ కూడా మరింత దృఢంగా తయారవ్వాలి అంటే ఆమె ఆరోగ్యం కూడా మెరుగు పడాలి.. అలా మహిళలను మరింత దృఢంగా మార్చే ఆహారపదార్థాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.

ఈ మధ్య కాలంలో మహిళలు ఎక్కువగా ఆస్టియోపోరోసిస్ అనే భయంకరమైన సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల ఎముకలలో సాంద్రత లేకపోవడం వల్ల ఏ పనులు చేయ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక అలాంటి వారు తప్పకుండా పాలను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. పాలలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎటువంటి ఎముకల సంబంధిత సమస్యలు అయినా సరే ఇట్టే దూరం అవుతాయి. పాలల్లో ప్రోటీన్స్, విటమిన్ బి కాంప్లెక్స్, పాస్పరస్ , పొటాషియం, విటమిన్ డి కూడా మనకు కొద్ది మోతాదులో లభిస్తాయి కాబట్టి పాలను తప్పకుండా ప్రతిరోజు మహిళలు తాగాల్సి ఉంటుంది.

ఆకుకూరల్లో మెగ్నీషియం ఉంటుంది కాబట్టి ఆకుకూరలు కూడా తప్పకుండా తీసుకోవాలి. బచ్చలి కూర తో పాటు బ్రోకలీ ని కూడా ఆహారంలో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో చక్కగా పనిచేస్తాయి. అండాశయ సమస్యలు, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ తో పాటు ఈస్ట్రోజన్ స్థాయిలను కూడా పూర్తిగా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. ఇక బీట్రూట్ అత్యధిక ఫైబర్ ను కలిగి ఉండడం వలన జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి.. రక్తపోటును నియంత్రిస్తుంది. ఇక ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉండే గుడ్లు ఒక కప్పు బాదం తో పాటు డ్రైఫ్రూట్స్ కూడా తీసుకోవడం వల్ల మహిళలు ఆరోగ్యం విషయంలో మరింత దృఢంగా మారుతారు.