Health Tips : మీకు చంకలలో నల్లగా మారిపోయిందా..? దీనితో మీరు ఎప్పుడూ కూడా అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారా..? ఇక స్లీవ్ లెస్ టాప్స్ లేదా డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇందుకు తగ్గ టిప్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పే ఒక చిట్కా గనుక మీరు పాటించినట్లయితే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేది స్పష్టంగా తెలుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే త్వరగా తెలుసుకుందాం..ఈ మధ్య కాలంలో అమ్మాయిలు చాలామంది ఎదుర్కొనే సమస్యలలో బ్లాక్ అండర్ ఆర్మ్స్ కూడా ఒకటి. నల్లటి చంకల వల్ల అమ్మాయిలు తమకు నచ్చిన దుస్తులను వేసుకోలేక పోతుంటారు. ముఖ్యంగా స్లీవ్ లెస్ డ్రెస్ ల విషయంలో అయితే మరీ దారుణం అని చెప్పాలి. అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ తో ఈ సమస్యకు స్వస్తి చెప్పవచ్చు.

1. కలబంద:కలబంద ని మనం ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుంటాము.. ఆరోగ్యంతో పాటు అందానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా చర్మాన్ని అందంగా ఉంచడానికి ఈ కలబంద ఎంత బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా చంకలలో నలుపుదనాన్ని కూడా ఈ కలబంద పోగొడుతుంది.. ఇందుకోసం మీరు కలబంద గుజ్జును తీసుకుని అండర్ ఆర్మ్స్ కి పూర్తిగా అప్లై చేయాలి. 10 నుంచి 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి పూర్తిగా ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఈ పద్ధతిని మీరు తరచూ రిపీట్ చేస్తూ ఉండడం వల్ల త్వరగా మార్పును గమనించవచ్చు.
2. లైటనింగ్ క్రీమ్స్:చాలామంది చంకలలో సేవ చేసిన తర్వాత క్రీమ్స్ వంటివి రాయరు. దీని వల్ల చర్మం నల్లగా మారిపోతుంది. అందుకే ఎప్పుడైనా సరే షేవ్ చేసిన తర్వాత క్రీమ్స్ రాసుకోవాలి. ముఖ్యంగా కోజిక్ యాసిడ్ వంటివి రాయడం వల్ల చర్మం మృదువుగా మారడంతోపాటు నల్లగా మారిపోకుండా తెల్లగా మీ స్కిన్ మెరుస్తూ ఉంటుంది.