Papaya Tips : ఇక బొప్పాయి ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరమో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అయితే ఆరోగ్యానికి ప్రయోజనాలు లభించాలి అంటే బాగా పండిన బొప్పాయిని తినాల్సి ఉంటుంది.. పచ్చి బొప్పాయి తినడం వల్ల ఎన్నో నష్టాలు కలుగుతాయి అని ఇది ఆరోగ్యానికి చాలా డేంజర్ అని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు.. ఇకపోతే పచ్చి బొప్పాయి తినడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..ముఖ్యంగా పచ్చి బొప్పాయిని గర్భిణీ స్త్రీలు అసలు తినకూడదు.. ఇక ఈ పచ్చి బొప్పాయి లో ఉండే ప్రోటియో లైటిక్ అనే ఎంజైమ్ కారణంగా గర్భాశయం విచ్చిత్తికి కారణమవుతుంది.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్భందాల్చాలనుకునే వారు లేదా గర్భం దాల్చిన వారు అసలు తినకూడదు. మిగతా వారు ఈ పచ్చి బొప్పాయిని కొద్ది మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియ కు మేలు జరుగుతుంది.. కానీ ఎక్కువగా తినడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఇందులో ఉండే పపైన్ మూలకం కారణంగా జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి.పచ్చి బొప్పాయిని తినడం వల్ల ఒక్కోసారి వాంతులు కూడా అవుతాయి.. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ రబ్బరు పాలు లా ఉంటుంది. అధికంగా తినడం వల్ల అన్నవాహిక దెబ్బతిని వికారం , వాంతులు వంటి సమస్యలు వస్తాయి.

గురక సమస్య కూడా అధికంగా వస్తుంది..ఎక్కువ పరిమాణంలో పచ్చి బొప్పాయిని తినడం వల్ల ఆస్తమా రోగులకు హాని కలిగే అవకాశం ఎక్కువ. పపైన్ ఎన్నో అలర్జీలను కలిగిస్తుంది.. ముఖ్యంగా కడుపుబ్బరం, తల తిరగడం, తలనొప్పి వంటి సమస్యలు కూడా కలగవచ్చు. తప్పని పరిస్థితులలో తినాలి అనిపిస్తే మాత్రం తప్పకుండా సలహాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నవారు కూడా పచ్చి బొప్పాయిని అస్సలు తినకూడదు. ఇక పండిన బొప్పాయిని కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి.