Health Benefits : మాఘమాసం ఇంకా పూర్తవలేదు.. భగభగ మండే సూర్యుడు ప్రజలపై తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. బయట అడుగుపెట్టాలంటే చాలు పగటిపూట ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక అప్పుడే ప్రజలు భయపడిపోతున్నారు. పూర్తిగా వేసవి కాలం రానే లేదు ఇలా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఏప్రిల్, మే నెలలలో ఎలా ఉండాలో తెలియక ఇప్పటి నుంచే ఆందో ళన చెందుతున్నారు. అందుకే ఇలాంటి వేసవి కాలంలో.. అధికంగా వెలువడే వేసవి తాపం తగ్గించుకోవాలి అంటే మనం శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి. ఇక చాలా మంది బయట ఉష్ణాన్ని తట్టుకోలేక ఇంట్లో కూలర్లు, ఏసీలు వంటివి పెట్టుకొని ఆహార పదార్థాలు తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
చల్లటి పానీయాలను తాగడానికి ఇష్టపడుతున్న నేపథ్యంలో ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం ఉత్తమం.. అలాంటి వాటిలో మజ్జిగ కూడా ఒకటి.. అయితే పెరుగును పెరుగు లాగా కాకుండా మజ్జిగలా చాలా పల్చగా బాగా నీటిని పోసి తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది . అంతేకాదు శరీరానికి చలవ కూడా.. ఇకపోతే ఈ మజ్జిగను తాగడం వల్ల ఇంకెన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మజ్జిగలో శరీరాన్ని చల్లబరిచే తత్వమే కాదు క్యాల్షియం, ప్రోటీన్స్, పొటాషియం వంటి పోషకాలు కూడా ఎక్కువగా లభిస్తాయి. వడదెబ్బ తగలకుండా ఆరోగ్యంగా ఉండడానికి మజ్జిగ ఒక మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు. ఇక మజ్జిగను ఎక్కువగా తాగడం వల్ల ఇందులో ఉండే కాల్షియం, పొటాషియం కారణంగా ఎముకలు దృడంగా మారుతాయి.

అధిక రక్తపోటుతో బాధపడే వారు కూడా మజ్జిగను ఉప్పు లేకుండా తీసుకోవడం చాలా మంచిది. మజ్జిగ తాగడం వల్ల శరీరంలో ఉండే అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది .. తద్వారా రక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది. పైగా బరువు కూడా పెరగదు.ఇక కడుపుబ్బరం, ఆకలి లేకపోవడం, జీర్ణక్రియ సమస్యలు ,రక్తహీనత , కామెర్లు వంటి సమస్యలను కూడా మజ్జిగ ద్వారా మనం దూరం చేసుకోవచ్చు. త్వరలోనే వేసవికాలం రాబోతోంది కాబట్టి ఇప్పటినుంచి ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్న నేపథ్యంలో మీ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఈ మజ్జిగ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.