Glowing Skin : మెరిసే చర్మం కోసం ఇంటి చిట్కా..!!

Glowing Skin : అందంగా ఉండడమే కాదు ఆరోగ్యంగా కూడా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యానికి.. అందం కూడా తోడైతే అది మనకు చాలా మంచిది.. ఇకపోతే ముఖంతో పాటు చర్మాన్ని కూడా మెరిపించు కోవాలి అంటే కొన్ని ఇంట్లో తయారు చేసే సూపర్ బాడీ ప్యాక్ లను ఉపయోగించడం చాలా మంచిది. ఇకపోతే మెరిసే చర్మం కావాలి అంటే వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా శెనగపిండి.. రెండు టేబుల్ స్పూన్ల పెరుగు.. కొన్ని చుక్కల నిమ్మరసం అలాగే చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు దీనిని చర్మానికి అలాగే ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇకపోతే ఈ ప్యాక్ వల్ల మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఇక దీనితో పాటు వేడి నీళ్లతో స్నానాన్ని కూడా మనం దూరం పెట్టడం చాలా మంచిది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం మీద తాజాదనం వెళ్ళిపోయి పొడిబారిపోతుంది. మనం అందంగా కనిపించాలంటే వేడి నీళ్లను దూరం చేసుకోవాలని వైద్యులు సైతం సలహా ఇస్తున్నారు. మరికొద్ది రోజుల్లో వేసవికాలం రాబోతోంది కాబట్టి చల్లని లేదా గోరువెచ్చని నీటితో స్నానం చాలా బాగుంటుంది.

Home tip for glowing skin
Home tip for glowing skin

ఇకపోతే ముఖం కడిగే ప్రతిసారీ కూడా చాలా మంది సబ్బులను వాడుతున్నారు. ఇలా వాడడం వల్ల సబ్బులలో ఉండే కొన్ని రసాయనాలు చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. ఇక మార్కెట్లో దొరికే ఫేస్ వాష్ జెల్ లేదా సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా శెనగపిండితో ముఖం కడుక్కున్నా మంచి ఫలితాలు లభిస్తాయి.. ఇక వీటితో పాటు అధికంగా నీటిని తాగడం.. పోషకాహారాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం లాంటివి చేయడం వల్ల మంచి శుభ పరిణామాలు కలుగుతాయి.