Beauty Tips : మీ ముఖాన్ని అందంగా తీర్చిదిద్దే హోమ్ రెమిడి ఇదే..!

Beauty Tips : ప్రతిఒక్కరు అందంగా, తాజాగా కనిపించాలి అనుకుంటారు. కానీ ఇప్పుడున్న కాలుష్యం,స్ట్రెస్ మన ముఖం అందాన్ని నాశనం చేస్తున్నాయి. వీటి వల్ల మచ్చలు, మొటిమలు, ర్యాషెస్, మృతకణాలు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.ఇలాంటి సమస్యలకు రైస్ తో చేసే ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ డల్ స్కిన్ ఎక్స్‌ఫోలియేట్ చేసి అన్ని స్కిన్ సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అలాంటి రైస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా సుమారు 2 టేబుల్ స్పూన్ల పచ్చి బియ్యాన్ని తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. రఫ్ గా అయినా ఉండొచ్చు. బియ్యం పొడి మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ఆ తర్వాత బియ్యం పిండిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపాలి.

ఇందులో ఉండే విటమిన్ సి,స్కిన్ టోన్ మెరుగుపరస్తుంది. విటమిన్ సి కూడా సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. మరియు ఇది చర్మం సాగుదలకు ఉపయోగపడే కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఆ తరువాత, ఈ మిశ్రమానికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. తేనె వల్ల చర్మం పై బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. మరియు అందులోనే అర టేబుల్ స్పూన్ గ్రీన్ టీ వాటర్ కలపాలి. గ్రీన్ టీ ఫేస్‌ప్యాక్ ముఖము పై కల మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఫేస్ ప్యాక్‌ను పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత, మీరు దానిని మీ ముఖానికి అప్లై చేసుకోవచ్చు.ముందుగా మీ ముఖాన్ని శుభ్రం చేసుకొని, పొడిగా ఉండేలా చూసుకోవాలి.

Home remedies to Beauty Tips your face
Home remedies to Beauty Tips your face

ఇప్పుడు శుభ్రమైన చర్మంపై ప్యాక్ వేసుకొని మీ వేళ్లతో లేదా ఫ్లాట్ ఫేస్ ప్యాక్ బ్రష్‌తో ఫేస్ ప్యాక్‌ను అప్లై చేసుకొని మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలాంటి ప్యాక్ పది రోజులకొకసారి వేసుకుంటే చర్మాన్ని చాలా బాగా శుభ్రం చేస్తుంది. ఈ ప్యాక్ రెగ్యులర్ వాడకంతో, మీ చర్మం మృదువుగా మారుతుంది. ఇది కూడా మృదువైన మరియు శుభ్రంగా అనిపిస్తుంది. ఇది మీ చర్మం నుండి చనిపోయిన చర్మం లేదా చనిపోయిన చర్మ కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మానికి 100% సురక్షితంగా ఉంటుంది.దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది చర్మ సంరక్షణ విషయంలో చాలా గొప్ప ప్రయోజనాలను కనబరుస్తుంది.తొందరగా వృద్యాప్య ఛాయలు రాకుండా కాపాడుతుంది.కంటికింద వచ్చే నల్లటి వలయాలను సైతం నయం చేస్తుంది.దీని వల్ల చర్మం గ్లాసీగా కనిపిస్తుంది.