Beauty Tips : దానిమ్మలో శరీరానికి కావాల్సిన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా దొరుకుతాయి. అలాగే ఈ పండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు,యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి.మరియు అందమైన చర్మాన్ని అందించడంలో సహాయపడతాయి.
మొటిమలు.. చాలా మందికి హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వల్ల మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి ఎన్ని రోజులకు తగ్గకపోతే ముఖము యొక్క అందము తగ్గిపోతుందని బాధపడుతుంటారు. అలాంటి వారు దానిమ్మ రసంలో, కొంచెం మిల్క్ పౌడర్, ఆరెంజ్ పీల్ ఆఫ్ పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో మొటిమలపై మెల్లగా మర్దన చేసి, అరగంట తర్వాత చల్లటి నీరుతో వాష్ చేసుకుంటూ ఉంటే 15 రోజుల్లో ఈ సమస్యతగ్గిపోయి, ముఖము అందంగా తయారవుతుంది.
యువ్వన చర్మం : వాయు కాలుష్యం, జీవనశైలి మరియు ఒత్తిడి వల్ల చర్మం పాడవుతుంది. దీనిని రిపేరు చేయడానికి దానిమ్మ చాలా ఉపయోగపడుతుంది. దాని కోసం తేనె, పెరుగు మరియు దానిమ్మతో పేస్ట్ లాగా తయారు చేసి ముఖానికి రాయాలి. ఇలా వారానికి రెండు సార్లు నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది.
ఎర్రటి పెదవులు.. అందమైన మరియు ఎరుపు పెదవులు కోసం మీకు దానిమ్మను చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని కోసం ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, తేనె, కొబ్బరి నూనె తీసుకుని వేడి చేసి..దీనికి దానిమ్మ రసాన్ని కలిపి వేడి చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఉంచి రోజూ వాడితో ఎర్రటి పెదాలు మీ సొంతం అవుతాయి.
మృత కణాలు తొలగించడం.. మృతకాణాలు తొలగించి వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడతాయి. ఈ కొత్త కణాలు ఏర్పడటానికి దానిమ్మ సహాయపడుతుంది. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో దానిమ్మను చేర్చుకోవడం మంచిది.సాధారణంగా మార్కెట్లలో లభించే దానిమ్మ నూనెను కొని, రోజూ మీ ముఖానికి రాసుకోండి. మీకు కనీసం ఒక వారంలో మార్పు కనిపిస్తుంది.
హైడ్రేషన్ : డీహైడ్రేషన్ వల్ల చర్మం విపరీతంగా పొడిగా, పగిలిపోయినట్టు అనిపిస్తుంది.దానికి కూడా దానిమ్మలో చాలా బాగా ఉపయోగపడుతుంది.రోజూ వారి ఆహారంలో దానిమ్మపండు తినడం వల్ల మీ చర్మాన్ని తేమగా ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. లేదా మీరు దానిమ్మ రసాన్ని తీసుకుని నేరుగా మీ ముఖానికి అప్లై చేసినా మంచి ఫలితం ఇస్తుంది.దానిమ్మ ను బాగా ఉపయోగిస్తే రక్త ప్రసరన బాగా జరిగేలా చేస్తుంది. దాని వల్ల గుండే ఆరోగ్యము మెరుగుపడుతుంది.