Healthy Skin : ఎవరైనా సరే మెరుగైన ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు చర్మ సంరక్షణకు మాత్రం చాలా బాగా సహాయపడుతాయి. ఇకపోతే ఆ చర్మ సంరక్షణకి ఉపయోగపడే చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..ఇకపోతే చర్మానికి అదనపు శ్రద్ధ హైడ్రేషన్ అవసరమవుతుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.. మీరు నిద్రించే సమయంలో ఉపయోగించే పిల్లో కేస్ మార్చాలి. ఎందుకంటే మీరు ఉపయోగించే పిల్లో కేసుపై ముఖం పెట్టడం వలన బ్యాక్టీరియా, డెడ్ సెల్స్ వంటివి పేరుకుపోయి చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయి. కాబట్టి వారానికి ఒకసారి మీరు మీ పిల్లో కేసును మార్చడం చాలా మంచిది..
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఉండే హానికరమైన టాక్సిన్స్ చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి రోజువారీ వ్యాయామం చేయడం వల్ల శరీరానికి పోషకాలు సమానంగా విస్తరింప చేయబడతాయి. అంతేకాకుండా సమతుల్య వ్యాయామ దినచర్య వల్ల మంచి చర్మాన్ని పొందవచ్చు.ఈరోజు నాణ్యమైన నిద్రను పొందడం వల్ల ఆరోగ్యకరమైన చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు.. నిద్రపోయే సమయంలో శరీరం లోని ముఖ్యమైన అవయవాలు అలాగే కణాలు తమను తాము రిపేరు చేసుకుంటాయి..
కాబట్టి కనీసం 7 నుండి 8 గంటలు నిద్ర పోవడం వలన అవయవాల పనితీరు మెరుగు పడి చర్మం కూడా తాజాగా ఆరోగ్యంగా ఉంటుంది..మీ మొబైల్ స్క్రీన్ ను శుభ్రం చేస్తూ ఉండాలి..ఎందుకంటే టాయిలెట్ కంటే మురికిగా మొబైల్ స్క్రీన్ ఉంటుందిఅని తాజాగా ఒక అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి అపరిశుభ్రమైన ఈ విషయం వల్ల మీ చర్మం ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు కూడా మీ మొబైల్ స్క్రీన్ శుభ్రం చేసుకోండి.. ఇక ఫైబర్ కంటెంట్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం.. ఖనిజాలు, పోషకాలు వంటివి శరీరానికి సమృద్ధిగా లభించడం వంటివి చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా వుంటుంది.