Health Tips : దుంప జాతికి చెందిన బీట్ రూట్ ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా బీట్ రూట్ లో లభించే పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. బీట్ రూట్ లో నైట్రేట్ల కంటెంటు ఉండడం వల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది. మట్టి లోపల పండే దుంపలు ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి.. కాబట్టి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో అనేక రకాల మినరల్స్, విటమిన్లు కూడా ఉంటాయి. ఇక ఇది చర్మ సమస్యలను తొలగిస్తుంది అని చెప్పవచ్చు.
బీట్ రూట్ జ్యూస్ క్రమం తప్పకుండా తాగడం వల్ల ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడమే కాకుండా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఇక బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల వృద్ధాప్య లక్షణాలను కూడా దూరం చేసుకోవచ్చు. బీట్ రూట్ లో సహజ రసాయనమైన నైట్రేట్ ఉంటుంది. ఇక నైట్రిక్ ఆక్సైడ్ గా మారుతుంది. శరీరంలో రక్త ప్రవాహాన్ని సులభతరం చేయడానికి బాగా సహాయపడుతుంది. ఇక బీట్రూట్లో విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా లభించడం వల్ల బీట్ రూట్ జ్యూస్ క్రమం తప్పకుండా తాగితే శక్తి పెరుగుతుంది . ఇక శారీరక శ్రమ , అలసట కూడా తగ్గిపోతుంది.
ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా బీట్రూట్ తినడానికి కొంచెం సంకోచిస్తారు. దీనిని మితంగా తీసుకుంటే వారికి అన్ని ప్రయోజనాలు లభిస్తాయి.జుట్టు పెరగడానికి బీట్ రూట్ ను చాలా చక్కగా సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్య ఉన్నవారు బీట్రూట్ తినడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది. ఇక బీట్రూట్ జ్యూస్ లో కొద్దిగా అల్లం కలిపి తాగితే జుట్టురాలే సమస్య నుంచి మరింత ఉపశమనం పొందవచ్చు. ఇక స్థూలకాయ సమస్యను తగ్గించడం.. కాలేయ సంబంధిత వ్యాధులు.. దీర్ఘకాలిక క్యాన్సర్ లాంటి రోగాలను దూరం చేయడంలో బీట్రూట్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.