Health Tips : ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి ఆహారపు అలవాట్లు మరియు జీవన విధానంలో మార్పులు వంటి వాటి వల్ల అనేక రకాల రోగాలను కొని తెచ్చుకుంటున్నాడు. ఇలాంటి వాటికి అనేక రకాల రసాయన మందులు వాడి అనేక దుష్ప్రభావాలు కలిగి ఇబ్బంది పడుతున్నాడు. కానీ అన్ని ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద శాస్త్రంలో అనేక పరిష్కారాలు ఉన్నాయి. అందులో భాగమే రణపాలా ఆకు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
మూత్రపిండాలు రాళ్లు : మూత్రపిండాల్లో మరియు గాల్ బ్లాడర్ లో ఏర్పడే రాళ్లను కరిగించే గుణం రణపాల ఆకుకి పుష్కళంగా వుంది. ఈమధ్య కాలంలో మూత్రపిండాలు మరియు పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడి ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి రణ పాలాకు బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం ప్రతిరోజు రెండు పూటలా రణపాలాకును నమిలి రసాన్ని మింగుతూ వుండాలి. ఇలా వాడితే మూత్రపిండాలు మరియు గాల్ బ్లాడర్ లో ఉండే ఎంత పెద్ద రాల్లయినా కరిగిపోతాయి.
క్యాన్సర్ చికిత్స : ప్రతి రోజు రణపాల ఆకులు నమిలి మింగడం వల్ల క్యాన్సర్ నుంచి తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ గడ్డలు ఇట్టే కరిగిపోతాయి. వీరు రణపాల ఆకు లను ఎండబెట్టి పొడి చేసుకుని ప్రతిరోజు ఒక చిటికెడు గోరు వెచ్చని నీటిలో వేసుకుని తాగడం వల్ల, వ్యాధినిరోధక శక్తి పెరిగి, క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది.
ఊపిరితిత్తులకు చికిత్స : కాలుష్య వల్ల ఊపిరితిత్తులకు కావలసినంత ఆక్సిజన్ చేరకపోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇందుకోసం రణపాల ఆకు రసాన్ని మరియు తేనే , గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగితే ఊపిరితిత్తులకు ఉపశమనం లభిస్తుంది.
నొప్పులకు చికిత్స : శరీరంలో వచ్చే అనేక రకాల నొప్పులకు ఈ ఆకులను పేస్ట్ గా నూరి,ఆ మిశ్రమాన్ని నొప్పి ఉన్న భాగంలో పట్టు లా వేస్తే తొందరగా నొప్పిని నివారించే గుణం ఇందులో వుంది.
పక్షవాతానికి చికిత్స : పక్షవాత రోగుల శరీరంలో ఏదో ఒకవైపు వారికి రక్తనాళాలు గూడుకట్టుకుని పోయి ఆ భాగం పనిచేయడం ఆపివేస్తుంది.అలాంటి వారు ఈ రణపాల ఆకు రసం తీసుకుంటే రక్త ప్రసరణ బాగా జరిగి తొందరగా పక్ష వాతం నుండి కోలుకుంటారు.
రణపాల ఇతర ప్రయోజనాలు : ఇవే కాక రణ పాలకు నోటి దుర్వాసనను పోగొడుతుంది.కంటి వ్యాధులను నివారిస్తుంది. మొలలు వ్యాధులకు రెండు రణపాల ఆకులకు,మిరియాలు కలిపి నమిలి మింగితే మొలలు వ్యాధికి ఉపశమనం కలుగుతుంది. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది.