Health Tips : ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఒక డాక్టర్ మీ ఇంట్లో ఉన్నట్టే దానికి కారణం ఇదే!!

Health Tips : సాధారణంగా కొన్ని చెట్లు అలాగే మొక్కలు.. మనల్ని అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. అంతే కాదు ఈ మొక్కలు మన ఇంట్లో ఉంటే ఇక మనం డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక అలాంటి వాటిలో మునగకాయ కూడా ఒకటి. ఇక దీనిని ఇష్టపడని వారంటూ బహుశా ఎవరూ ఉండరేమో.. ఇక దీనిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ఇకపోతే మునగకాయ యొక్క పూర్తి ప్రయోజనాలను ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.. కూరగాయలో మునగాకు కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీని వేరు నుంచి పండు వరకు ప్రతీది కూడా ఉపయోగకరమైనదే. రుచికరమైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకున్నప్పుడే మనం అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాము.

ఇక ఇటువంటి పోషకాలు కలిగిన కూరగాయలలో మునగ ప్రయోజనాలను మనం ప్రధమంగా గుర్తించాలి. ఇక ఈ ప్రయోజనాల గురించి స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా సదస్సులో కూడా తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తే మునగా యొక్క ఉపయోగాలు ఎన్నో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా దీని కాండం, బెరడు, ఆకులు, పువ్వులు, కాయలు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పోషకాల విషయానికి వస్తే.. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్, ఫాస్ఫరస్ తో పాటు యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ,యాంటీ డిప్రెసెంట్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో అమృతంలా పరిగణించే ఈ మునగ 300 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేస్తుంది.

Health Tips on Drumstick leaves
Health Tips on Drumstick leaves

అందుకే ఆయుర్వేదంలో మునగను అమృతం అని పిలుస్తూ ఉంటారు. ఇక ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న మునగ.. రక్తంలో చక్కర స్థాయిని నియంత్రిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీని క్రమం తప్పకుండా తీసుకుంటే డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇక దీని ఆకులలో విటమిన్ సి లభిస్తుంది.. అంతేకాదు అధిక బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ప్రభావాల నుంచి గుండెను కాపాడుతుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. మునగ ఆకుల్లో లభించే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. క్యాన్సర్ లక్షణాలను కూడా దూరం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి తప్పకుండా వారానికి రెండు లేదా మూడుసార్లు మునగ కాయలు, ఆకులతో చేసిన వంటలను ఆహారంలో చేర్చుకోవాలి.