Health Tips : పండ్లు తినడానికి కూడా ఒక పద్దతి వుంటుందని మీకు తెలుసా..?

Health Tips : ఈ మధ్య కాలంలో ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. కానీ పండ్లను తినేటప్పుడు కొన్ని పద్ధతులను అనుసరించాలి.కొన్ని పండ్లను కొన్ని పండ్లతో కలిపి తింటే చాలా సమస్యలు తలెత్తుతాయని తెలియక ఫ్రూట్స్ మిక్స్ చేసి సలాడ్స్ రూపంలో తింటూ వుంటారు. అయితే ఏ పండు ఏ పండుతో కలిపి తినకూడదో ఎలాంటి పద్ధతులు అనుసరించాలో ఇప్పుడు చూద్దాం..

1. మిక్సింగ్ మరియు తినేటప్పుడు.. వివిధ పండ్లను మిక్స్ చేసి తినేటప్పుడు కాంబినేషన్ సరిగ్గా ఉండాలి. అవును, తీపి పండ్లను సిట్రిక్ పండ్లతో కలపకుండా తినాలి. సలాడ్స్ తింటుంటే తీపి పండ్లను మాత్రమే తీసుకోవాలి. లేకపోతే పుల్లని పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కో పండు మీ పొట్టలో ఒక్కోరకమైన జీర్ణ రసాలను విడుదల చేస్తుంది. ఉదాహరణకు, పైనాపిల్ మరియు కమలా పండు తో, మామిడితో ఎప్పుడూ తీసుకోకూడదు. పుచ్చకాయతో కలిపిన ఏ పండ్లను తినవద్దు. ఎందుకంటే పుచ్చకాయ పండులో నీటిశాతం ఎక్కువగా ఉండడంతో తొందరగా జీర్ణమవుతుంది. కాబట్టి మీరు పుచ్చకాయ తినాలనుకుంటే, అది మాత్రమే తినాలి.

Health Tips in Eating fruits is also a method
Health Tips in Eating fruits is also a method

2. పండ్లపై ఉప్పు-చాట్ మసాలాను వేసి తినకూడదు… రుచిగా ఉండేందుకు చాట్ మసాలా, ఉప్పు ను ఫ్రూట్స్ తో కలుపుతారు. పండులో ఉప్పు కలపడం వల్ల వెంటనే పండు నుండి నీరు విడుదలవుతుంది. ఈ నీరు పండ్ల నుండి పోషకాలను నశింపచేస్తుంది.అలాగే ఉప్పు, చాట్ మసాలాలో ఉండే సోడియం మన శరీరంలో నీరు నిలుపుకునేలా చేయడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి.

3. రాత్రి భోజనం తర్వాత పండ్లు తినవద్దు.. భోజనం తర్వాత పండ్లు తింటే అది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. పండ్లలోని షుగర్ వాల్యూస్, కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లతో పులియబెట్టి, జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిగా జరిగేలా చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది రానురాను జీర్ణ సమస్యలకు దారితిస్తుంది.కాబట్టి భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం మంచిది కాదు.

4. పండు కోసిన తర్వాత కడగవద్దు!.. ఎప్పుడు పండ్లు మరియు కూరగాయలను తినడానికి ముందు శుభ్రం చేసుకోవాలి.కోసిన తర్వాత పండును కడిగితే అందులోని పోషకాలాన్ని తరిగిపోతాయి.

5. పండు తినే సమయం.. ఉదయం టిఫిన్ తిన్న గంట తర్వాత మరియు భోజనం తిన్న గంట తర్వాత తినాలి. అప్పుడే అవి పొట్టలో బాగా జీర్ణమై పోషకాలాన్ని పుష్కళంగా లభ్యమవుతాయి. నిత్యం వ్యాయామం చేసే వారైతే, వ్యాయామానికి అరగంట ముందు పండ్లను తినడం వల్ల దానికి కావాల్సిన శక్తి, నీరు తక్షణమే అందుతాయి.