Health Tips : నొప్పుల నివారిణి.. పెంచే ఈ మొక్క గురించి తెలుసా..!?

Health Tips : అతిబల మొక్క మనలో అందరం చూసే ఉంటారు.. ఈ మొక్కను చాలామంది పిచ్చి మొక్క గా భావిస్తారు .. చిన్నప్పుడు ఈ చెట్టు కాయలతో టపాకాయల ఆటాడుకునేవారు పిల్లలు.. పల్లెటూర్లలో ఈ మొక్క విరివిగా కనిపిస్తూనే ఉంటుంది.. అతిబల మొక్క లో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి..! వాటి వలన బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి..! అవేంటో ఇప్పుడు చూద్దాం..!

అర టీ స్పూన్ అతిబల పొడిని, ఒక చెంచా తేనెతో కలిపి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే.. అన్ని రకాల నొప్పులను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, కండరాల వాపులను కూడా తగ్గిస్తుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్ లను తొలగించడంలో సహాయపడుతుంది. గాయాలు, పుండ్లు ఉన్నచోట అతిబల పొడిని రాస్తే త్వరగా తగ్గిపోతాయి. కొబ్బరి నూనెలో కొద్దిగా అతిబల పొడిని కలిపి ముఖానికి రాసుకోవాలి.

Health Tips in Atibala plant
Health Tips in Atibala plant

అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ముఖం పై ఉన్న మొటిమలు, మచ్చలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.అర టీ స్పూన్ అతిబల పొడిని, ఒక చెంచా తేనెతో కలిపి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం సాయంత్రం రెండు పూటలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే పురుషుల్లో శృ.. సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ఇతర సమస్యలు కూడా తొలగిస్తుంది. శీఘ్రస్కలన సమస్య తగ్గుతుంది. వీర్యం వృద్ధి చెందుతుంది. కాకపోతే ఈ పొడిని మితంగా తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.