Health Problems : బిజీ లైఫ్ స్టైల్ లో మార్పులు.. తీసుకునే ఆహారంలో పోషకాల లోపం.. వాతావరణంలో కాలుష్యం.. నీటి కాలుష్యం ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల సరైన పోషకాహార విలువలు కలిగిన ఆహారం తీసుకోలేక పోతున్నారు చాలామంది. కానీ మనం తీసుకొనే అల్పాహారం రోజువారీ దినచర్య పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇక ఎప్పుడైతే సమయానికి సరైన పోషకాహారం తీసుకోకపోతే అప్పుడు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో చాలా మంది అల్పాహారం పేరిట ఏదో రకరకాల ఆహారం తీసుకుంటున్నారు. ఫలితంగా కడుపులో గ్యాస్ , అజీర్తి తో పాటు మరెన్నో సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఇక ఉదయాన్నే మనం ఖాళీకడుపుతో వివిధ రకాల పోషకాలు లేని ఆహారం తీసుకున్నట్లయితే మరి ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక మరికొంతమంది తమ పనులలో బిజీగా ఉండడం వల్ల అల్పాహారం తీసుకోవడం మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కడుపులో గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
అంతే కాదు కళ్ళు తిరగడం, వాంతులు వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇక అల్పాహారంలో కేవలం పోషకాహారం కలిగిన ఆహారం మాత్రం తీసుకోవడమే కాదు సరైన తాజా పండ్ల రసాలను కూడా తీసుకోవాలి. అయితే పండ్లరసాలు తీసుకునేటప్పుడు కూడా కొన్ని రకాల పండ్ల రసాలకు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే వాటి వల్ల లభించే యాసిడ్ లు కొన్ని కడుపులో మంటను పుట్టిస్తాయి. ముఖ్యంగా పోషకాహారం కలిగిన ఆహారాలతో అల్పాహారం తీసుకోవాలి . అంటే ప్రతి ఒక్కరు కూడా నానబెట్టిన పెసలు , శెనగలు, వేరు సెనగలు, బాదం ఇలాంటివి నానబెట్టిన తర్వాత ఉదయాన్నే తీసుకుంటే శరీరానికి కావలసిన తక్షణ శక్తి తో పాటు అనేక పోషకాలు లభిస్తాయి. ఇకపోతే అల్పాహారం లో జ్యూసులు తాగేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే వీటి వల్ల మరింత అనారోగ్యం ప్రబలే అవకాశం ఉంటుంది. మరి మనం తీసుకునే అల్పాహారంలో ఎలాంటి పోషకాలు కలిగిన జ్యూస్ ను తాగాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇకపోతే ఇటీవల కాలంలో చాలా మంది అధిక బరువుకు గురి అవుతున్నారు. ఈ అధిక బరువు వల్ల మరెన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇకపోతే డైట్ లో భాగంగా చాలా మంది బరువు తగ్గడానికి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ మానేస్తూ.. జ్యూస్ తాగడం మొదలు పెట్టారు. వీటి వల్ల బరువు తగ్గడమే కాకుండా చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఈ జ్యూస్ ల వల్ల కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి అవసరమైన పోషకాలు పండ్లలో ఉన్నందువల్ల తాజా పండ్ల రసం తాగడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు అందిస్తాయి. కానీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏ పండ్లరసాలను తాగకూడదో ఒకసారి తెలుసుకోవాలి. లేకపోతే మరిన్ని సమస్యలకు దారి తీయవచ్చు.
సిట్రస్ పండ్ల రసం : నిమ్మ , నారింజ, ద్రాక్ష వంటి పండ్ల రసాలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ వీటిని తీసుకుంటే నిమ్మరసం యాసిడ్ లాంటిది కాబట్టి ఫలితంగా గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. శరీరానికి హానికరం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయాన్నే అల్పాహారంలో సిట్రస్ జాతికి చెందిన పండ్ల రసాలను తీసుకోకూడదు. ఇక మీరు ఒకవేళ వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి అనుకుంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈ రసాలు తాగడం తప్పనిసరి.
శీతల పానీయాలు : ఇక చాలామంది వేసవిని తట్టుకోలేక ఉదయాన్నే రిఫ్రిజిరేటర్ లో ఉంచిన శీతలపానీయాలు తాగుతూ ఉంటారు. వీటివల్ల శరీరానికి మరింత హానికరం అవుతుంది అని గమనించాలి. ఇకపోతే శీతల పానీయాలను సాధ్యమైనంతవరకు ఉదయాన్నే తీసుకోకపోవడమే మంచిది. లేకపోతే మరెన్నో సమస్యలు తలెత్తుతాయి. బరువు తగ్గాలనుకున్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా సరే సరైన పోషకాహారం తీసుకోవాలి. మొలకెత్తిన గింజలు, ఆపిల్ , అరటి పండు లాంటివి తినడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది.