Health Problems : బ్రెడ్ ఎక్కువగా తింటున్నారా..?

Health Problems : ఇటీవల కాలంలో చాలా మంది బ్రేక్ ఫాస్ట్ రూపంలో బ్రెడ్, జామ్ కలిపి తింటూ ఉంటారు. ముఖ్యంగా ఎవరికైనా అనారోగ్యం అనిపించినా, ఆరోగ్యం బాగా లేకపోయినా సరే బ్రెడ్ ను ఎక్కువగా తింటూ ఉంటారు. ఇక మరికొంతమంది ఏదైనా వంట వండుకునే ఓపిక లేక బ్రెడ్ జామ్ అంటూ తింటూ ఉంటారు. ఇక రోగులకు బ్రెడ్ ఎందుకు ఎక్కువగా పెడతారు అంటే నెమ్మదిగా జీర్ణం అవుతుందని ఎక్కువగా పెడతారు. ఇక కొంతమంది వైట్ బ్రెడ్ ను ఎక్కువగా తింటారు.. మరికొంతమంది బ్రౌన్ బ్రెడ్ ను అధికంగా ఉంటారు. ఇకపోతే వైట్ బ్రెడ్ ను అధికంగా తినకూడదు అనే వారు ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటున్నారు.

వైట్ బ్రెడ్ లో అధిక కార్బోహైడ్రేట్లు కంటెంట్ ను కలిగి ఉంటుంది కాబట్టి దీని వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వైట్ బ్రెడ్ తయారీకి మైదా పిండిని ఎక్కువగా ఉపయోగిస్తారు. మైదా లో అధికంగా తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు మైదా వల్ల వివిధ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే వైట్ బ్రెడ్ అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం.. శరీరంలో వేడి, ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వైట్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ తినడం చాలా మంచిదని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

Health Problems Do you eat a lot of bread
Health Problems Do you eat a lot of bread

ముఖ్యంగా వైట్ బ్రెడ్ తినడం వల్ల మానసిక స్థితిపై ప్రభావం అధికంగా చూపుతుంది అని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. ఇక ఎవరైతే ఊబకాయంతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు పూర్తిగా వైట్ బ్రెడ్ కి దూరంగా ఉండాలి. డయాబెటిస్ పేషంట్స్ కూడా అస్సలు తినకూడదు. వైట్ బ్రెడ్ అధికంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చాలావరకు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకునేటప్పుడు కూడా బ్రౌన్ బ్రేడ్ ఉపయోగించడం తప్పనిసరి . బ్రౌన్ బ్రెడ్ తో ఇలాంటి సమస్యలేవీ ఉండవు.. అయితే అది కూడా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.