Health Benefits : గోధుమ పిండిలో అధిక పైబర్ ఉంటుందని అందరికి తెలుసు. కానీ గోధుమ గడ్డి రసం లో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసా.. ఈ జ్యూస్ బరువు తగ్గాలనుకునే వారికి మరియు ఫిట్‌నెస్ ట్రై చేసేవారికి ఇది సూపర్ ఫుడ్ గా ఉపయోగపడుతుంది..ఈ మధ్య కాలంలో గోధుమ జెర్మ్ నుండి తయారైన జ్యూస్ కి బాగా ఆదరణ లభించింది. ఎందుకంటే ఇందులో అధిక ఫైబర్ మరియు ప్రోటీన్లు పుష్కళంగా లభిస్తాయి. అంతే కాకుండా ఇందులో విటమిన్ ఎ, సి, కె, ఇ మరియు బి,ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం కూడా అధిక మొతాదులో లభిస్తాయి.
ఇప్పుడు గోధుమ గడ్డి ని అందరూ ఇంట్లోనే పెంచుకుంటున్నారు.అలా పెంచుకోవడానికి వీలు లేనివారి కోసం గోధుమ గడ్డి పొడులు కూడా ఆయుర్వేద షాపుల్లో లభిస్తాయి. ఈ పౌడర్ ఆరోగ్యానికే కాదు, ముఖ సంరక్షణకు, జుట్టుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాక స్త్రీ లలో హార్మోనల్ ఇన్ బాలెన్స్ ను కూడా తగ్గిస్తుంది. రక్తహీనత ను అరికడుతుంది. ముఖము పై వచ్చే మొటిమలను తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన గోధుమ గడ్డిని ఏవిదంగా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
గోధుమ గడ్డి జ్యూస్.. తాజా గోధుమ గడ్డి దొరకనివారు, దాని పొడిని కూడా ఉపయోగించవచ్చు. గోధుమ గడ్డితో చేసినా జ్యూస్ కానీ,గోధుమ గడ్డి పొడిలో కానీ ఏదయినా ఒక యాపిల్, ఆరెంజ్, పైనాపిల్ లేదా అల్లం రసం కలిపి త్రాగాలి.ఈ జ్యూస్ ని పరగడుపున త్రాగడం వల్ల, జీవక్రియను పెంచడమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.ముఖ్యంగా మధుమేహం వున్నవారు గోధుమ గడ్డి జ్యూస్ ఒక్కటే పరగడుపున రోజూ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచి మధుమేహాన్ని తగ్గిస్తుంది.
గోధుమగడ్డి ఫేస్ ప్యాక్.. గోధుమ గడ్డిలో యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి.ఈ గోధుమ గడ్డి పొడి లో ఆరెంజ్ తొక్కల పొడి కలిపి, పాలతో మిక్స్ చేసి మొటిమలు మీద అప్లై చేయాలి. ఇది ముఖంపై మొటిమలను తగ్గించడమే కాకుండా మంటను నివారించడంలో సహాయపడుతుంది. ముఖాన్ని అందంగా మారుస్తుంది.
వీట్ గ్రాస్ హెయిర్ ప్యాక్ గోధుమ గడ్డి పొడిని నిమ్మరసంతో మిక్స్ చేసి, పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కుదుళ్ల నుండి జుట్టు చివర వరకు అప్లై చేయాలి. పదిహేను నుండి ఇరవై నిమిషాల తర్వాత జుట్టును గోరు వెచ్చని నీటితో కడగాలి. ఈ హెయిర్ ప్యాక్ చుండ్రును తొలగించడమే కాకుండా జుట్టు మూలాలను బలపరుస్తుంది.