Health Benefits : వేసవి కాలం మరో నెలలో రాబోతోంది అని అనగానే ఇప్పటి నుంచే మండే ఎండలు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న కారణంగా బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తోంది. బయట ఉష్ణోగ్రతలు రోజురోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం.. డీహైడ్రేషన్ కు గురి కావడం.. వడదెబ్బ తో పాటు మరెన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వేసవి కాలంలో ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా నీరు అధికంగా లభించే పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. అలాంటి వాటిలో పుచ్చకాయ కూడా ఒకటి.పుచ్చకాయ తినడం వల్ల శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. వేసవి కాలంలో వేసవి తాపాన్ని.. దాహార్తిని తీర్చడానికి ఈ పుచ్చకాయలు చాలా బాగా ఉపయోగపడతాయి.
అంతేకాదు ఈ సీజన్లో ఎక్కువగా లభించే పుచ్చకాయలు మనం తినడం వలన డీహైడ్రేషన్ సమస్య నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు. ఇకపోతే ఇందులో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు.. క్యాల్షియం, విటమిన్ బి ,సోడియం, క్లోరిన్ , పొటాషియం, జిటాకెరోటిన్ , విటమిన్ ఇ, ఆల్కలైన్, విటమిన్ సి, విటమిన్ బి 6 వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడం లో పుచ్చకాయ బ్రహ్మాండంగా పని చేస్తుంది.ఎండవల్ల చర్మం పై వచ్చే ట్యాన్, దద్దుర్లు వంటివి నివారించడంలో చాలా బాగా పనిచేస్తుంది.

ఇక గర్భిణీ స్త్రీలు ఈ పుచ్చకాయ తినడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతారు బాధపడేవారు తేనె కలుపుకుని తింటే చాలా మంచిది. డయాబెటిస్ ఉన్నవారు కూడా పుచ్చకాయలు తినడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి.గుండెపోటును కూడా నివారించడానికి పుచ్చకాయలు చాలా బాగా పనిచేస్తాయి. మనసును ప్రశాంతంగా ఉంచడం లోనూ.. క్యాన్సర్ వ్యాధిని నివారించడం లో..బీపీ ని కంట్రోల్ చేయడంలో.. రక్త సరఫరాను మెరుగుపరచడంలో.. కిడ్నీలో రాళ్లను దూరం చేయడంలో.. మలబద్దక సమస్యలను తగ్గించడంలో.. కీళ్ల నొప్పులను రోగాలను దూరం చేయడంలో ఈ పుచ్చకాయ చాలా బాగా పనిచేస్తుంది.