Thota Kura : ఆకుకూరల రారాజు.. తింటే ఘనమైన ప్రయోజనాలు..!

Thota Kura : ప్రతిరోజూ ఆకుకూరలను తినమని ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు..! ఆకుకూరలలో మన శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి..! ఆకుపచ్చని ఆకుకూరలు రారాజు తోటకూర..! మిగతా ఆకుకూరలతో పోలిస్తే ఇందులో పోషకాలు ఎక్కువే.. తోటకూరను తినకపోతే ఎటువంటి ప్రయోజనాలను మిస్ అవుతారంటే..!?తోటకూర లో విటమిన్ ఏ, సి, డి , ఈ, కె, బి12, బి6 లు ఉన్నాయి.. వీటితో పాటు సెలీనియం, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ అదనం.

ఇందులో పీచుపదార్థాలు కూడా ఎక్కువగా లభిస్తాయి. తోటకూర వేపుడు కంటే ఉడికించుకుని తింటే ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఇందులో ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. తోటకూర రక్తనాళాల్ని చురుగ్గా ఉంచుతుంది. ఇందులో గుండెకు మేలు చేసే సోడియం పొటాషియం ఉన్నాయి. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు తోటకూర తింటే ఎంతో మంచిది.తోటకూర లోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

Health Benefits of Thota Kura
Health Benefits of Thota Kura

సీజన్స్ మారినప్పుడు వచ్చే రోగాలను తోటకూర అడ్డుకుంటుంది. శరీరంలోకి హానికర బ్యాక్టీరియా, వైరస్ కారక క్రిములు ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. తోటకూర ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు కాకుండా అందాన్ని కూడా పెంపొందిస్తాయి. ఈ ఆకులను మెత్తగా రుబ్బి తలకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలకుండా చేస్తుంది. చుండ్రు సమస్య ను నివారిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.