Health Benefits : మనం నిత్యం వండే వంటల్లో కాస్త చింతపండు తగలనిదే రుచి ఉండదు..! పొగరు పుల్లని రుచిని కలిగి ఉన్నా నా నోటికి ఇంపుగా ఉంటుంది.. అంతేకాదండోయ్ చింత చెట్టు వలన ప్రయోజనాలు ఉన్నాయి.. చింత చెట్టు ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం..!చింతపండు ను జ్వరం, వికారం, కడుపుబ్బరం, అసిడిటీ వంటి సమస్యలకు మందులు ఉపయోగిస్తారు.
ఆకలి లేనివారు, ఆకలి మందగించిన వారు ఉదయాన్నే ఐదు స్పూన్స్ చింతపండు రసాన్ని సేవిస్తే ఆత్మరాయుడు కేకలు వేయాల్సిందే. ఇక శరీరంలో ఎలాంటి నొప్పి ఉన్న చింతపండు రసంలో కొద్దిగా ఉప్పు వేసి నొప్పి ఉన్న చోట రాసి మసాజ్ చేయండి. వెంటనే అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి. చింత చిగురు పప్పు పచ్చడి మాంసాహారంలో ఎక్కువ గా వేసుకుని తింటారు. చింత చిగురు తినడం వలన వాత పిత్త కఫ దోషాలను తొలగిస్తుంది.

చింతచిగురు రసంలో పటిక బెల్లం వేసి తాగితే కామెర్లు తగ్గుతాయి. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు.. చింతచిగురును ఉడికించి ఆ మిశ్రమాన్ని రాస్తే త్వరగా తగ్గిపోతాయి. చింతగింజలు పొడిచేసి ప్రతిరోజు ఒక ఒక చెంచా పొడిని నీటిలో కలిపి తాగితే జిగట విరోచనాలు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తస్రావం తగ్గుతుంది. చింతపిక్కల పొడిలో పంచదార కలిపి వారం రోజులపాటు తీసుకుంటే వీర్యాభివృద్ధి జరుగుతుంది. వీర్యస్ఖలనాన్ని నివారిస్తుంది.