Health Benefits : చాలా మంది బచ్చలి కూరను అంత ఇష్టంగా తినరు. కానీ ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం కచ్చితంగా అసలు తినకుండా వదలరు అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా బచ్చలి కూర గ్రామాల్లో, పట్టణాలలో, ఇంటి పెరట్లో ఇంటి దగ్గర ఈజీగా పెరిగే ఆకు కూరల్లో ఒకటి. బచ్చలి కూర ను పెంచడానికి ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. ఇది ఒక్కసారి వేస్తే చాలు తీగలా పెరటి మొత్తం అల్లుకుపోతుంది. ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే మొక్కల్లో బచ్చలి కూరకు ప్రత్యేకమైన స్థానం ఉంది. బచ్చలి కూరను పప్పులాగా, సాంబారుల చేసుకుని తింటే సీజనల్ గా వచ్చే జ్వరం, జలుబు ఇట్టే తగ్గిపోతాయి. అంతేకాదు కడుపులో మంట, అజిర్తి సమస్యలు కూడా ఉపశమనం దొరుకుతుంది.
బచ్చలి కూరను ఎక్కువగా పచ్చ కామెర్లు లేదా జాండిస్ వచ్చిన వారికి మంచి ఔషదంగా పని చేస్తుంది. దీనిని ఆహారంలో భాగంగా అధికంగా తీసుకున్నప్పుడు ఇందులో ఉండే సి విటమిన్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులో విటమిన్ ఏ పుష్కళంగా లభిస్తుంది. కావున కంటి చూపు తగ్గిన వారికి బచ్చలి కూర బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను బయటకు మలం రూపంలో పంపిస్తుంది. దీంతో హానికరమైన విషతుల్యమైన పదార్థాలు ఏమైనా శరీరంలో ఉంటే, వాటిని వెంటనే బయటకు విసర్జించబడతాయి. కావున అధిక బరువుతో బాధపడేవారు ఈ ఆకు కూరను రోజూ వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల సన్నగా అవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.
బచ్చలాకులో ఉండే రసాన్ని జ్యూస్ గా చేసుకుని తాగడం వల్ల పొట్టలో పేరుకున్న మలినాలు అన్ని ఇట్లే బయటకు వెళ్ళిపోతాయి. అంతేకాదు పొట్ట శుభ్రం అయి,పొట్టలోని గ్యాస్ తగ్గి , ప్రశాంతంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది. దీని వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తవు.ఈ ఆకు కూర వల్ల బిపి ఉన్నవారికి మంచి ఫలితాలు లభిస్తాయి.దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల, గుండె జబ్బులు రాకుండా నివారించుకోవచ్చు.ముఖ్యంగా తరచూ బచ్చలి కూర తినే వారిని మలబద్ధక సమస్యలు కనిపించవు.గర్భిణీ స్త్రీలు ఎక్కువగా రక్త హీనతతో బాధపడుతుంటారు. అలాంటి వారికి ఈ ఆకు కూర తో చేసే ఈ పదార్థాలను ఎక్కువగా ఇస్తున్నట్టు అయితే, హిమోగ్లోబిన్ శాతం పెరిగి, రక్త హీనత తగ్గుతుంది. కాబట్టి ఇన్ని పోషకాలున్న బచ్చలి కూరను ఆహారంలో బాగా తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది.