Health Benefits : ఎర్ర బెండకాయతో రోగాలన్నీ పరార్..!

Health Benefits : సాధారణంగా బెండకాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కానీ కొన్ని రకాల బెండకాయ లు ఎరుపు రంగుల్లో పండిస్తున్నారు. అయితే ఆకుపచ్చ బెండకాయ కన్నా రెడ్ బెండకాయ లో అధిక పోషకాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు పరిశోదనలు చేసి మరీ నిరూపించారు. ఎరుపు బెండకాయల్లో 21 శాతం ఐరన్ ఉండడం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడుతుంది.గుడ్డులో ఉన్నట్టు ప్రొటీన్లు ఈ బెండకాయ లో కూడా దొరుకుతాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి,మెటబాలిజం ను మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది.

ఈ ఎర్ర బెండను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చాలా ఏళ్ల పాటూ పరిశోదించి మరీ, అభివృద్ధి చేసారు. దీని వంగడం పేరు’రాధికా’. దీనికి సర్వ రోగాలను నియంత్రించే శక్తి కలిగి ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గర్భిణీ స్త్రీలు ఈ మధ్య కాలంలో రక్త హీనతతో బాధపడుతున్నారు. అటువంటి వారికి ఈ బెండకాయ చాలా ఉపయోగపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు దీనిని పరగడుపునే నమిలి తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ నీ సమతుల్యంగా ఉంచి,మధుమేహన్ని అదుపులో ఉంచుతుంది.

Health Benefits Of Red lady finger cures all diseases..!
Health Benefits Of Red lady finger cures all diseases..!

రెడ్ బెండను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒత్తిడి సమస్యలు తగ్గి, బీపీ కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచి అనేక సీజనల్ గా వచ్చే ఫ్లూ, జలుబు, దగ్గు,జ్వరాలు వంటి రోగాలను అదుపులో ఉంచడంలో ఎరుపు బెండకాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. శరీరంలోచెడు కొవ్వులు అధికంగా ఉండి ఎక్కువగా లావు ఉన్నవారు, ఎముకలు, కీళ్లలో అరుగుదల ఉన్నవారు.. ఈ ఎర్ర బెండను రోజువారీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించడమే కాక, ఇందులో వున్న క్యాల్షియం, నొప్పులను నివారిస్తుంది. ఎర్ర బెండలో అధిక ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణాశయ సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. ఇది పేగు క్యాన్సర్ కలిగించే కణాలను నశింపచేస్తుంది.

ఇందులో ఉండే సి విటమిన్ వల్ల చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది. దీనిని రోజూ వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ A అధికంగా లభించి కంటి చూపును మెరుగుపరుస్తుంది. వీటిలో బి కాంప్లెక్స్‌లు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా పిల్లలకు తరుచుగా తినిపిస్తే, వారి పెరుగుదల సక్రమంగా ఉంటుంది. ఇన్ని పోషకాలు పుష్కళంగా వుండే ఈ ఎరుపు బెండను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..