Health Benefits : ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో మొక్కలలో రణపాల మొక్క కూడా ఒకటి. ఇక ఈ మొక్కలు మనకు ఎన్నో రోగాలను నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.. ముఖ్యంగా ఈ మొక్కలను ఎక్కువగా ఇంటి పరిసరాలలో, ఆఫీసుల చుట్టూ.. కార్యాలయాల దగ్గర అలంకరణ కోసం పెంచుతారు. అందం కోసం మాత్రమే పెంచుకునే ఈ మొక్కలు ఎన్నో రోగాలను నయం చేసే గుణం ఉంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ మొక్కలు విశిష్ట స్థానం సంపాదించుకోవడం జరిగింది. ఇక ఈ మొక్క సుమారుగా 150 కి పైగా రోగాలను నయం చేస్తుందట. ముఖ్యంగా రణపాల మొక్కలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ వైరల్, యాంటీ హిస్టామైన్ తో పాటు అనాఫీ లాక్టిక్ వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇక దీనితోపాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను రణపాల ఆకు ద్వారా నయం చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఈ మొక్క యొక్క ఆకులను తినడానికి రుచికి పుల్లగా, వగరుగా అనిపిస్తాయి. ఇక రణపాల ఆకులు కిడ్నీ సమస్యలను ,కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు ఈ ఆకులను ఉదయం, సాయంత్రం రెండు చొప్పున తినాలి . లేదా ఉదయం పూట ఆకుల కషాయాన్ని 30ML మోతాదులో తీసుకుంటూ వుంటే.. కిడ్నీలు, బ్లాడర్లో ఉండే స్టోన్లు మొత్తం కరిగిపోతాయి. మూత్రపిండాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇక అంతే కాదు షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిదని చెప్పవచ్చు . రణపాల ఆకులను తింటే రక్తంలోని క్రియాటిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు ఆకులను తింటే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.

రణపాల ఆకుల ద్వారా జీర్ణాశయంలోని పల్సర్లు తగ్గుతాయి. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. ఇక అంతేకాదు ఇటీవల కాలంలో వచ్చే దగ్గు, జలుబు , జ్వరం , విరోచనాలను కూడా పోగొట్టే ఔషధం రణపాల ఆకులకు ఉంది. ముఖ్యంగా రణపాల ఆకులతో మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు కూడా దూరం చేసుకోవచ్చు. రక్త పోటు సమస్యతో బాధపడే వారు కూడా రణపాల మొక్క ఆకుల రసాన్ని సేవిస్తే సమస్య అదుపులో ఉంటుంది. ఇక అంతేకాదు జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుంది. తెల్ల వెంట్రుకలు రావడం ఇట్టే తగ్గిపోతాయి. ఇక అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన వేడి కురుపులు, కొవ్వు గడ్డలు తగ్గిపోతాయి. ఇక శరీరంలో వాపులు కూడా నయమవుతాయి. యోని రుగ్మతలు , చెవిపోటు, తలనొప్పి,పచ్చ కామెర్లకు కూడా ఒక మంచి ఔషధం అని చెప్పవచ్చు.