Health Benefits ; ఇప్పుడు చిన్నా, పెద్ద తేడా లేకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అనారోగ్య సమస్య తగ్గించడానికి ఎన్నో రకరకాల రసాయన మందులు వాడడం వలన దుష్ప్రభవాలు కలుగుతున్నాయి. అదే ఆయుర్వేద వైద్యంలో మన ఇంట్లోనే పెరిగే కొన్ని మొక్కలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మొక్క రణపాలాకు . ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే మనం డాక్టర్ దగ్గర ఉన్నంత రక్షణగా ఉంటుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్, అనాఫిలాప్తిన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి అధిక బీపి, షుగర్, మూత్రపిండ సమస్యలు,శ్వాస కోస వ్యాధులు,మరియు అంటువ్యాధులు, గాయాలు ఇలాంటి ఎన్నో రకాల సమస్యల నుంచీ ఉపశమనం కలిగిస్తుంది.అంతే కాక ఈ మొక్కకు వాస్తుపరంగా కూడా ఫ్రాధాన్యత ఉంది.
ఈ ఆకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. రణపాలాకు తిమ్మిరి, ఆయాసం వ్యాధులకు ఆయుర్వేదంలో మంచి ఔషదంలా పనిచేస్తుంది. జలుబు, దగ్గు సమస్యలతో పాటు శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది.ఈ ఆకులను నాలుగు తీసుకుని గ్లాసు నీటిలో వేసి మరిగించి కషాయం చేసి ఆ నీటిని పరగడుపున తాగాలి.లేకుంటే నాలుగు ఆకులను నమిలి, మింగాలి. ఇది కిడ్నీ, గాల్ బ్లాడర్లోని పేరుకున్న రాళ్ళను కరిగించి మూత్రం ద్వారా బయటకు పంపేస్తుంది. నడుము నొప్పి, తలనొప్పి వచ్చినప్పుడు ఈ ఆకు మిశ్రమాన్ని లేపణంగా వేయడం వలన వాటికీ వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ ఆకులతో పాటు మిరియాలు వేసి నములతూ ఉంటే ఫైల్స్ క్రమంగా తగ్గుతాయి. ఈ ఆకు రసాన్ని త్రాగటం వల్ల కడుపులో పుండ్లు, అల్సర్లు కు మంచి ఉపశమనం కలిగిస్తుంది.
మరియు మద్యం వలన పాడయిన లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ రెండు ఆకులను పరగడుపున తింటే షుగర్ అదుపులో ఉంటుంది. శరీరంలో రక్తప్రసరణ వేగంగా జరిగేలా చేస్తుంది.తెల్లజుట్టు సమస్యను తగ్గిస్తుంది. కామెర్ల వ్యాధితో బాధపడేవారు ఉదయం, సాయంత్రం ఈ ఆకు రసం తాగితే సరిపోతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ తో పోరాడి వృద్ధాప్యలక్షణాలు తొందరగా రాకుండా చేస్తాయి. డయాలసిస్ రోగులకు మూత్రపిండాల పనితీరు క్రమభద్దీకరిస్తుంది. అజీర్తి, మలబద్దకం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది సీజనల్ గా వచ్చే మలేరియా, టైఫాయిడ్ ను తగ్గిస్తుంది . చెడు కొలెస్ట్రాల్ కరిగించి,గుండెసంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇందులో యూరోటిక్ లక్షణాలు ఉండటం వల్ల రక్తంలో చీము, రక్తం పడడాన్ని నిరోధిస్తుంది.ఇది అనేక చర్మసమస్యలకి ఈ ఆకుల మిశ్రమాన్ని లేపణంగా వేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఇన్ని ఔషదాలున్న రణపాలాకు పెంచడం మొదలుపెట్టండి.