Health Benefits : ఎండు ద్రాక్షను ఎక్కువగా స్వీట్ తయారీలో రుచి కోసం వాడుతుంటారు. అయితే ఇది కేవలం రుచికే కాక అందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి వుంటుంది. ఎండు ద్రాక్ష తినడం వల్ల కలిగే లాభాలెంటో ఇప్పుడు చూద్దాం..
జీర్ణక్రియలో సహాయం : ఎండుద్రాక్ష జీర్ణవ్యవస్థను సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది.ఇందులో కావాల్సిన పీచు పదార్థాము అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలో పేరుకుపోయిన మలాన్ని మొత్తం సేకరించి పేగుల ద్వారా సులభంగా వెళ్ళడానికి సహాయపడుతుంది.
హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.. ఈ మధ్య కాలంలో స్త్రీలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాంటి వారికి రక్తహీనత నివారించడంలో ఎండుద్రాక్ష చాలా బాగా ఉపయోగపడుతుంది . ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి మరియు శరీరమంతా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి అవసరమైన ఐరన్, కాపర్ మరియు విటమిన్లు ఎక్కువ మొత్తంలో శరీరానికి అందిస్తుంది.
ఎసిడిటీని నివారిస్తుంది : పొట్టలో అధిక ఆమ్లాల కారణంగా ఆసిడిటీ కలుగుతుంది. దీనిని నివారించడానికి ఎండుద్రాక్షలో ఐరన్, కాపర్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ముఖ్యమైన కణజాలు అధికంగా లభిస్తాయి.ఇవి కడుపులో ఆసిడిటీ లెవెల్స్ క్రమబద్దీకరించడంలో సహాయపడతాయి.
క్యాన్సర్ కారకాలను నసింపచేస్తుంది.. ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్ లు అధికంగా లభిస్తాయి. అవి శరీరాన్ని ఆక్సీకరణ నష్టం మరియు క్యాన్సర్ కలిగించే ఫ్రీ రాడికల్స్ కరిగించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా స్త్రీ లకు ప్రొస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా సహాయపడతాయి.
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎండుద్రాక్షలో పాలీఫెనాల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల కళ్లలోని నరాలు ను ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి కాపాడటానికి సహాయపడతాయి.ఇది వయస్సు పెరిగేకొద్దీ కళ్ళలో మచ్చలను మరియు కంటిశుక్లం లో పువ్వు ఏర్పడటం వంటి కంటి సమస్యల నుండి కళ్ళను కాపాడటంలో సహాయపడతాయి.
చర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచుతాయి.. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలకు వృద్యాప్య లక్షణాలను దూరం చేసి, నిత్య యవ్వనంగా ఉండటానికి ఉపయోగడతాయి.ఎండుద్రాక్షలో విటమిన్ సి, సెలీనియం మరియు జింక్ వంటి విలువైన పోషకాలు కూడా అధికంగా లభిస్తాయి.ఈ పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్ల కలయిక మంచి చర్మ అందాన్ని పెంచడం లో సహాయపడతాయి.
మధుమేహం తగ్గించడంలో.. జంక్ స్నాక్స్ తినడంతో పోలిస్తే,ఎండుద్రాక్ష తినడం వల్ల,రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తాజా పండ్ల కంటే ఎండుద్రాక్షలో ఎక్కువగా చక్కెరలు ఉన్నప్పటికీ, జంక్ స్నాక్స్‌తో పోలిస్తే ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇది రక్తంలో చక్కెర నిర్వహణకు బాగా పనిచేస్తుంది. కానీ తగిన మొతాదు లో తీసుకోవాలి.