Health Benefits : ఇటీవల కాలంలో చాలామంది తమ దైనందిక జీవితంలో తినడానికి కూడా సమయం లేక చాలా బిజీగా తమ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఒకవైపు పనులు.. మరొకవైపు బిజీ లైఫ్ స్టైల్ కారణంగా తినడానికి కూడా సరైన సమయం కేటాయించలేక ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం అల్పాహారం తీసుకోవడం అనేది రోజువారీ దినచర్య పై ఆధారపడి ఉంటుంది. ఉదయాన్నే మనం తీసుకునే పోషకాహార అల్పాహారం రోజు వారి ఆరోగ్యాన్ని కూడా సూచిస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. అల్పాహారంలో ముఖ్యంగా నానబెట్టి లేదా మొలకెత్తిన పెసర గింజలు తినడం వల్ల ఎటువంటి రోగాలు అయినా సరే దూరం అవుతాయి.
ఇక మొలకెత్తిన పెసర గింజలతో ఎలాంటి రోగాలు దూరం చేసుకోవచ్చో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..పెసలు ప్రతిరోజు రెండు టేబుల్ స్పూన్ల చొప్పున నీటిలో నానబెట్టి లేదా మొలకెత్తించి ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా తినడం వల్ల వేసవి కాలంలో వచ్చే అలసట, నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. అంతేకాదు వేసవికాలంలో శరీరంలో ఉష్ణం కూడా పెరుగుతుంది. అందుకే ప్రతి రోజు ఉదయాన్నే మొలకెత్తిన పెసర గింజలు తినడం వల్ల ఇటువంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. పెసర గింజలలో మెగ్నీషియం సమృద్ధిగా లభించటం వల్ల రక్తపోటు సమస్యను అధిగమించవచ్చు.

చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి రక్త ప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు , గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.ప్రోటీన్లు, ఫైబర్ సమృద్ధిగా లభించే పెసర గింజలను ప్రతిరోజూ తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. పైగా ఇతర ఆహారం పై దృష్టి మరలదు. బరువు తగ్గాలని ఆలోచించే వారికి ఇది సరైన ప్రణాళిక అని చెప్పవచ్చు. ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో అటువంటి వారు ఈ పెసర గింజలు తినడం వల్ల బరువు తగ్గవచ్చు. ఒత్తిడి, ఆందోళన, తలనొప్పి , డయాబెటిస్ శరీరంలో అధిక ఉష్ణం , క్యాన్సర్ కణాలను దూరం చేయడంలో కూడా ఈ పెసర గింజలు చాలా బాగా పనిచేస్తాయి.