Health Benefitsసాధారణంగా నిమ్మరసం హెల్త్ కి మంచిదని అందరికి తెలిసిందే. అందుకే దాని రసం వంటల్లోను, జ్యూస్ లలోనూ, సౌందర్యానికి ఉపయోగిస్తుంటాము. ఏదయినా మీతిమీరకుండా వాడితే ఎలాంటి దుస్ప్రభావాలు కలగవు.కానీ బరవు తగ్గడానికని, అందానికని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాంటి వారికి కలిగే దుస్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చర్మ సౌందర్యానికి నిమ్మకాయలు ఎందుకు వాడుతున్నారంటే నిమ్మరసం ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్‌తో సహా చర్మాన్ని శుభ్రం చేసే కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మృత కణాలను తొలగించి వాటి స్థానం లో కొత్త వాటిని తయారుచేస్తుంది. దీనినే ఎక్స్ ఫోలియెంట్ చేయడానికి వాడుతుంటారు.
నిమ్మకాయల ఉపయోగాలు : * మృతకణాలు ఎక్కువై చర్మం పై పేరుకుపోకుండా చేసి దానిద్వారా బ్లాక్ హెడ్స్ ఏర్పడకుండా చేస్తుంది.
* మొటిమలు వల్ల కలిగే వాపు, ఆయిల్ ఉత్పత్తిని తగ్గించి దాని ద్వారా మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. మొటిమల వల్ల కలిగే మచ్చలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.కానీ అతిగా వాడితే దుష్ప్రభావాలు కలుగుతాయి.
సెన్సిటివ్ స్కిన్ వారికి హాని చేస్తుంది… ఇలాంటి వారు నిమ్మరసం డైరెక్టుగా వాడటం వల్ల చర్మం దురద , మంటను కలిగిస్తుంది.అయితే అత్యంత సాధారణంగా కనిపించే ప్రతి చర్య. కానీ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి కూడా ఇది తీవ్రంగా ఉంటుంది. నిమ్మరసం 2pH వద్ద చాలా ఆమ్లంగా ఉంటుంది కాబట్టి, అది చర్మానికి ఎక్కువ నష్టం కలిగజేస్తుంది.అంతే కాకుండా ఇది చర్మపు చికాకు, హైపర్ పిగ్మెంటేషన్, మృతకణాలను ఎక్కువ అయేలా చేస్తుంది.
కెమికల్ ల్యూకోడెర్మా(Chemical Leukoderma) నిమ్మరసం గాఢతను తగ్గించడం వల్ల దాని వల్ల కలిగే ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.నిమ్మరసం, ఆల్కహాల్ మరియు గ్లిజరిన్‌తో తయారు చేసిన టోనర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ టోనర్ వల్ల కెమికల్ ల్యూకోడెర్మా (తెల్ల మచ్చలు )వచ్చే అవకాశం వుంది.
ఐరన్ ట్యాబ్లేట్ వాడేవారు.. రక్తహీనతతో బాధపడేవారికి వైద్యులు ఐరన్ ట్యాబ్లేట్ వేసుకోమని చెబుతుంటారు.ఇలా ఐరన్ మాత్రలు వాడుతున్నవారు నిమ్మరసం తీసుకోవడం వల్ల ఐరన్ మాత్రలు ప్రభావవంతంగా పని చేయవని, ఆసిడ్ గుణం కలవాటికి దూరంగా ఉండమని సూచిస్తుంటారు.
పరగడుపున తీసుకోకూడదు.. బరువు తగ్గాలని ఉదయాన్నే లేవగానే పరగడుపున నిమ్మ రసం త్రాగుతుంటారు.అయితే ఇలా తాగడం వల్ల అసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు.అసిడిటీ ఉన్న వాళ్లు ఇలా నిమ్మకాయ రసం తాగితే, అది కడుపు పుండును అధికం చేసే అవకాశం వుంది.