Lady Fingers: ప్రకృతి వరం బెండకాయ.. దీన్ని రోజు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు స్పెషల్ వీడియో..!!

Lady Fingers: ఒకప్పుడు మనుషులకి ఇప్పుడు బతుకుతున్న మనుషులకి చాలా తేడాలు ఉన్నాయి. ఒకప్పుడు టెక్నాలజీ సెల్ ఫోన్ లాంటివి ఏమీ లేకపోయినా చాలా ఆరోగ్యంగా ఎటువంటి మానసిక సమస్యలు లేకుండా బతికారు. హాస్పిటల్స్ కి కూడా తక్కువగానే వెళ్లే పరిస్థితి అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ రావటంతో మానవ జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. చాలావరకు ప్రకృతికి దూరమై మందులతో పెంచిన ఆహార పదార్థాలకు ఎక్కువ అలవాటు పడ్డారు. అయితే ప్రజెంట్ అందరికీ అందుబాటులో ఉండే పచ్చి కూరగాయలలో చాలా వరకు మేలు చేసే వాటిలో బెండకాయ ఒకటి.

ఈ బెండకాయ తినటం వల్ల బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ ఉండటం మాత్రమే కాకుండా గుండెను ఆరోగ్యకరంగా మారుస్తది. ఇంగ్లీష్ లో లేడీ ఫింగర్ అని అంటారు. బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు.. మాత్రం పుష్కలంగా దొరుకుతాయని పోషక నిపుణులు చెబుతున్నారు. బెండకాయను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల లెక్టీన్ అనే ప్రోటీన్.. రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదమని తగ్గిస్తుంది. బెండకాయకి అనేక రకాల క్యాన్సర్లను అడ్డుకునే.. శక్తి ఉంది. బెండకాయ ప్రతిరోజు డైట్ లో ఉంటే జీర్ణ సంబంధిత సమస్యలు మరియు మలబద్ధకం నివారిస్తుంది.

Health benefits of Lady Fingers taking it daily Special video

అదేవిధంగా బెండకాయ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ నివారిస్తుంది. బెండకాయలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డ కట్టకుండా మరియు ఎముకలను స్ట్రాంగ్ గా చేయడంలో బాగా పని చేస్తది. గర్భిణీలకు కూడా బెండకాయ ఎన్నో మేలులు చేస్తాయి. పుట్టే పిల్లల్లో ఎముకలు స్ట్రాంగ్ గా ఉండటానికి సహాయపడతద్ది. అంతేకాదు జీర్ణక్రియ కూడా మెరుగు పరచడం జరుగుద్ది. వడదెబ్బను కూడా నివారించడంలో బెండకాయి ఎంతగానో సహాయ పడద్ది. చర్మ సంబంధిత పిగ్మెంటేషన్ నివారించే చర్మం కాంతివంతంగా కనబడేలా బెండకాయ చేస్తాది. అంత మాత్రమే కాదు కళ్ళకు చాలా మేలు కూడా చేస్తది.

 

అయితే బెండకాయ తిన్న తర్వాత కొన్ని కూరగాయలు తినకూడదు. అవి ఏంటంటే కాకరకాయ మరియు ములక్కాయ. అదేవిధంగా బెండకాయ కూర తిన్నాక అసలు పాలు తాగకూడదు. దీనివల్ల బోల్లు మచ్చ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బెండకాయతో పాటు .. పొట్లకాయ కలిపి తీసుకున్న కూడా అది కడుపులోకి వెళ్ళాక విషంగా మారుతుంది. ఒక్కోసారి చర్మ సమస్య వ్యాధులు మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. వీలైనంతవరకు బెండకాయ తో మరో కూర కలుపుకుండా సేవించడం మంచిది.