Health Benefits : కుప్పింటాకుతో వేల రోగాలు పరార్..!!

Health Benefits : ఇప్పుడున్న మన జీవనశైలిలో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ వుంటాయి. పని ఒత్తడి వల్ల, ఆహారపు అలవాట్లు వల్ల ఎన్నో వ్యాధులకు మనకు తెలియకుండానే గురవుతున్నాము. వ్యాధి సోకిన వెంటనే వైద్యున్ని కలవటం.. వారు ఎన్నో ఇంగ్లిష్ మందులను ఇవ్వటం.. అవి వాడినా వ్యాధులు తగ్గక బాధపడుతూ ఉండడం అలవాటైపోయినది. కానీ మన పూర్వికులు వ్యాధి సోకిన వెంటనే మరియు దెబ్బ తగిలిన వెంటనే ఆయుర్వేద మొక్కలతో నయం చేసుకొనేవారు. ఆ మందులు వాడటం వల్ల వారికీ ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేటి కావు. ఆయుర్వేద నిపుణులు ఎన్నో పరిశోదనలు చేసి మనకి ఎన్నో ఆయుర్వేద చిట్కాలను ప్రసాదించారు.అలాంటి వాటిలో కుప్పికంటి కూర ఒకటి. దీనినే మార్కండాకు అంటారు.దీనిని వేరు నుండి పువ్వుల వరకు అన్ని భాగాలలో వ్యాధులు తగ్గించే గుణం ఉంటుంది. వాటి లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పిప్పి పన్ను.. చాలా మంది పిప్పిపన్ను నొప్పితో బాధపడుతుంటారు. అలాటివారు కుప్పింటాకుని అరచేతిలో వేసుకొని బాగా రసం బయటకు వచ్చే లాగా నులిమి ఎక్కడ అయితే పిప్పిపన్ను ఉంటుందో దానిపై మాత్రమే పెట్టాలి. ఇది కొంచెం కారంగా, చేదుగా ఉండడం వల్ల పిప్పి పన్నులో ఏమైనా పురుగులు వున్నా చనిపోయి నొప్పినుండి ఉపాశమనం కలుగుతుంది.

Health Benefits of Kuppintaku uses in telugu
Health Benefits of Kuppintaku uses in telugu

పిచ్చి.. కొంతమంది కి ఒత్తిడి కారణంగా కొంచెం పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు.అలాంటి వారికి కుప్పింటాకు నుంచి రసం తీసి దానికి వేపనూనెను కలిపి ముక్కుతో నశిం పీల్చి నట్టు రోజుకొకసారి పీలస్తూ ఉంటే మెదడులో కణాలు వృద్ధి చెంది ఆలోచన విధానంలో క్రమంగా మార్పువచ్చి పిచ్చి లక్షణాలు తగ్గుతాయి.

తలనొప్పి.. చాలా మందికి పార్శ్వపు తలనొప్పి, సైనస్ నొప్పులతో బాధపడుతువుంటారు. అలాంటివారు ఈ మొక్క బెరడు రసాన్ని తీసి నువ్వుల నూనేతో కలిపి తలపై మర్దన చేస్తే చిటికెలో తగ్గుతుంది .మొదటగా తలనొప్పి ఎందుకు వస్తుందో గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి తగ్గుంచుకోవాలి మరియు నీరు ఎక్కువగా తీసుకోవాలి.

చర్మవ్యాధులు.. గజ్జి , సోరియాసిస్ వంటి చర్మవ్యాధులకు ఈ ఆకు చెక్ పెడుతుంది. ఈ ఆకు రసాన్ని వేప పిండి తో కలిపి చూర్ణం లాగా చేసి ఎక్కడైతే చర్మావ్యాధి వుందో అక్కడ లేపణంగా వేయాలి. ఇలా నెలరోజులు పాటు చేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది.

కీళ్ళ నొప్పులు.. కీళ్ల నొప్పులతో బాధపడేవారు కుప్పింటాకు రసాన్ని నువ్వులనూనెతో కలిపి నొప్పి వున్న చోటంతా రోజూ మర్దన చేయడం వల్ల కండరాలు వదిలి నొప్పులకు ఉపశమనం కలుగుతుంది .