Health Benefits : మన చుట్టూ ఉండే మొక్కలను పిచ్చి మొక్కలుగా భావిస్తుంటాం. కానీ, ప్రతి ఒక్క మొక్కలో ఏదో ఒక ఔషధ గుణం దాగి ఉంటుంది. మన పూర్వీకులకు ఈ విషయాల గురించి బాగా తెలుసు. అందుకే మన పూర్వీకులు. ఆ రోజుల్లో వారు వీటిని తీసుకుని ఎంతో ఆరోగ్యంగా జీవించారు. నేటితరం అయితే, చిన్న సమస్యకు కూడా వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ విషయం ఇలా ఉంటే.. ఆయుర్వేదంలో అసంఖ్యాక మూలికలు ఉన్నాయి. వాటిలో ఒకటైన నేలవేము (కల్మేఘం).
ఇందులోని ఔషధ గుణాలు అనేక రకాలైన జబ్బులను నయం చేస్తుంది. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మూలికలలో ఇది ఒకటి. ఔషధ గుణాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉపయోగించడం ద్వారా అనేక రకాలైన సమస్యలను నివారించవచ్చు. ఇవాళ మనం కల్మేఘం ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.నొప్పినుంచి ఉపశమనం నేలవేము (కల్మేఘం) అనాల్జెసిక్స్లో కూడిన ఆయుర్వేద ఔషధం శరీరంలోని నొప్పిని తగ్గించడానికి ఆయుర్వేదంలో దీనిని విరివిగా వాడతారు. శరీరంలో వాపు, ఇనుము లోపాన్ని తొలిగిస్తుంది.
జీర్ణవ్యవస్థను ఫదిలంగా ఉంచుతుంది.. జీర్ణ క్రియ సమస్యలను దూరం చేయడానికి నేలవాము రసాన్ని సేవించవచ్చు. ఇది పొట్టను శుభ్రం చేయడంలో, మల విసర్జనలో ఇబ్బందిని తగ్గిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల పిట్టా సమస్యను తగ్గించుకోవచ్చు.
కాలెయాన్ని సురక్షితంగా ఉంచుతుంది.. కాలేయాన్ని రక్షించడానికి కల్మేఘం తీసుకోవచ్చు. ఇది కాలేయాన్ని నిర్షీకరణ చేయటంలో ఉపయోగపడుతుంది. దీని వినియోగం ద్వారా లివర్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు.కల్మేఘం
వ్యాధులు దరిచేరవు… (నేలవేము) యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇన్ఫెక్షలను నివారించండంలో సహాయపడుతుంది. ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు దీనిని తీసుకోవటం వల్ల ఫ్లూ, గొంతు ఇన్ఫెక్షన్, జ్వరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.