Health Benefits : పచ్చిమిర్చి.. ప్రస్తుత కాలంలో ఎందులో అయినా సరే కారం తగలాలి అంటే కారంపొడికి బదులు ఎక్కువగా పచ్చిమిర్చిని చాలామంది ఉపయోగిస్తున్నారు పచ్చిమిర్చి ఉపయోగించడం వల్ల చక్కటి రుచితో పాటు సరైన కారం కూడా కూరకు అందుతుంది.. అయితే పచ్చిమిర్చి వల్ల కేవలం కూరకు రుచి మాత్రమే కాదు అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఆయుర్వేద పద్ధతుల ద్వారా ఎన్నో దీర్ఘకాలిక రోగాలను కూడా మనం నయం చేసుకోవచ్చు. ఇక ఈ క్రమంలోని పచ్చిమిర్చి ద్వారా కలిగే ప్రయోజనాలు కూడా ఆయుర్వేదంలో ప్రత్యేకంగా చెప్పబడ్డాయి.. మరి ఇంకెందుకు ఆలస్యం పచ్చిమిర్చి వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం. పచ్చిమిర్చిలో మనకు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.
నిజానికి విటమిన్ సి కోసం చాలామంది సిట్రస్ జాతికి చెందిన పండ్లను ఉపయోగించడంతోపాటు ఎక్కువగా నిమ్మకాయ, పుల్లటి పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. కానీ పచ్చిమిరపకాయ కూడా దీనికి ఉత్తమ మూలంగా పరిగణించబడుతుందని చెప్పవచ్చు. మీలో ఎవరైనా సరే విటమిన్ సి లోపంతో బాధపడుతున్నట్లయితే ప్రత్యేకంగా సిట్రస్ జాతి పండ్ల కోసం ఎదురు చూడకుండా మీరు తయారు చేసుకునే వంటలలో పచ్చిమిర్చి ఉపయోగిస్తే మంచి ఘాటుతో పాటు విటమిన్ సి కూడా మీకు లభిస్తుంది. ఇక విటమిన్ సి లోపాన్ని అధిగమించాలి అంటే పచ్చిమిర్చిని పచ్చిగా తింటేనే ప్రయోజనాలు కలుగుతాయి. ఐరన్.. ఇటీవల కాలంలో చాలా మంది మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే.. ఇక మహిళల్లో ఇలాంటి సమస్యలు దూరం చేయాలి అంటే తప్పకుండా వారికి ఐరన్ మూలకం తప్పనిసరి.
మరి పచ్చిమిర్చి ద్వారా మనకు ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. ఇక పచ్చిమిర్చి తినడం వల్ల రక్తం గడ్డ కట్టే సమస్య కూడా దూరం అవుతుంది యుక్తవయసులో గుండెపోటు రావడాన్ని పచ్చిమిర్చి అరికడుతుంది. ఇక గుండె చుట్టూ పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేయడంలో పచ్చిమిర్చి బాగా సహాయపడుతుంది. ఇక పచ్చిమిర్చిని ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా, ప్రభావితంగా పనిచేస్తుంది. ఇక వీటితోపాటు జీవక్రియ రేటును మెరుగుపరచడానికి పచ్చిమిర్చి సహాయపడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం పచ్చిమిర్చి తినేటప్పుడు అందులో ఉండే గింజలను కూడా కలిపి తినడం వల్ల జీవక్రియ రేటు వృద్ధి చెందుతుందని వారు చెబుతున్నారు. ఇక కొన్ని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా మేరకు పచ్చిమిర్చి తింటే మంచిది.