Health Benefits : ప్రకృతి ప్రసాదించిన ప్రతి మొక్క కూడా ఔషధపూరితమైనదని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా హిందూ సాంప్రదాయం ప్రకారం ఆయుర్వేద శాస్త్రంలో ఎక్కువగా ఈ మొక్కలను ఇకపోతే ఆయుర్వేద వృత్తిని కొనసాగిస్తూ ఇప్పటికీ కూడా చాలామంది ఎంతోమందికి వైద్య సేవలు అందజేస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఆకర్షణతో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంపొందించే కొన్ని రకాల మొక్కలలో గడ్డి గులాబీ మొక్క కూడా ఒకటి. గులాబీలలో ఒక రకమైన ఈ గడ్డి గులాబీ చూడడానికి అందాన్ని మాత్రమే కాదు ఎన్నో ఔషధ గుణాలను కూడా తనలో దాచుకుంది. ఎలాంటి భూమిలో నైనా.. ఎలాంటి చోట అయినా సరే పెరిగే ఈ అద్భుతమైన మొక్క ఇది.
అయితే ఈ మొక్కను ప్రాంతాన్ని బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అందాన్ని పెంపొందించి ఈ మొక్క ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. జుట్టు సమస్యతో ఎక్కువగా బాధపడేవారు ఈ మొక్కల కాండం, ఆకులను బాగా మెత్తగా నూరి, అందులోకి కాస్త కొబ్బరి నూనె వేసి బాగా కలిపి తలకు, జుట్టుకు పట్టించుకున్నట్లు అయితే జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుందట. చుండ్రు సమస్య పోవడమే కాకుండా జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఈ ఆకులను ఉదయం పూట తిన్నట్లయితే మరీ మంచిది.. ఇక వీటి గింజలను, ఆకులను సలాడ్లలో వాడుతూ ఉంటారు. ఈ ముక్కు చర్మం మీద ఉండేటువంటి నల్లటి మచ్చలను , మొటిమలను తగ్గించడంలోనూ బాగా సహాయపడుతుంది.
ఇక ఈ మొక్క కు పూసిన పువ్వులు బాగా నూరి అందులో కాస్త తేనెను వేసి ముఖానికి పట్టించి ఆ తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవడం వల్ల చాలా అందంగా మెరుస్తుంది. ఇక ఏదైనా గాయాలు తగిలి మనకు రక్తం ధారాలంగా కారుతున్నప్పుడు.. ఈ మొక్క యొక్క రసాన్ని అక్కడ పట్టించినట్లు అయితే ఆ గాయం నుండి వెంటనే రక్త శ్రావం ఆగిపోతుందట.చర్మంపై ఎక్కువగా పొక్కులు వచ్చినా.. పగిలినట్లు అనిపించినా.. ఈ మొక్క పూలను బాగా నూరి శరీరమంతటా పట్టించుకున్నట్లు అయితే అవి వెంటనే తగ్గిపోతాయి. ఇక ఈ మొక్కల వేర్లను కషాయం చేసుకుని తాగడం వల్ల తీవ్రమైన దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. అందుచేతనే ఈ మొక్కను ప్రతి ఒక్కరి ఇంటిదగ్గర పెంచుకోవడం చాలా అవసరం అని చెప్పవచ్చు.