Health Benefits : గంగవల్లి కూర ఎక్కడ పడితే అక్కడ పిచ్చి మొక్కలా పెరుగుతుంటది. మనం దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలియక ఏదో మొక్కే కదా అని వదిలేస్తుంటాము. కానీ ఇది అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో అద్భుతమైన ఔషదంగా ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అందు వలన వ్యాధుల చికిత్సలో ఈ మొక్కలు ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.ఇందులో అధిక మొత్తాదులో విటమిన్ ఎ .. మీ కళ్ళు ఆరోగ్యం కాపాడటమే కాక రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మరియు విటమిన్ ఎ ఆరోగ్యకరమైన కణ విభజనకు సహాయపడుతుంది. ఈ ఆకు కూరలో విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది.ఇది మీ కొల్లాజెన్ పెంచుతుంది. రక్తనాళాలను శుభ్రపరుస్తుంది.అలాగే గాయాలు నయం చేయడంలో సహాయపడుతుంది.
క్యాన్సర్ ప్రమాదం తగ్గిస్తుంది… గంగవల్లి కూర బీటా కెరోటిన్ అధిక మొత్తాదులో లభిస్తుంది. ఈ ఆకులలో అనేక యాంటీఆక్సిడెంట్లలో బీటా కెరోటిన్ శరీరానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కు కారణమైన శరీరంలో ఫ్రీ రాడికల్స్ సంఖ్యను తగ్గిస్థాయి. ఫ్రీ రాడికల్స్ శరీరంలోని అన్ని కణాల ద్వారా అందించబడే ఆక్సిజన్ అందకుండా చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ సంఖ్యను తగ్గించడం వల్ల సెల్యులార్ డ్యామేజ్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.ఇదిక్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యం… ఇందులో ఉండే పర్సులేన్ గుండె వ్యవస్థ బాగా పని చేసేలా సహాయపడుతుంది. ఈ ఆకు కూరలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వల్ల ధమనులు సక్రమంగా పని చేసేలా చేసి స్ట్రోకులు, గుండెపోటు మరియు ఇతర రకాల గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడతాయి. వాస్తవానికి పర్స్‌లేన్ భూమి-ఆధారిత మొక్కలన్నింటిలోనూ అధిక మొతాదులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు లభించును.
ఎముకల ఆరోగ్యం.. . ఎముకల ఆరోగ్యానికి కావాల్సిన ముఖ్యమైన రెండు ఖనిజాలు కాల్షియం మరియు మెగ్నీషియం.కాల్షియం అనేది శరీరంలోని ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరమైన ఖనిజం.మరియు దానిని తగినంతగా తినలేకపోతే మీ ఎముకలను నెమ్మదిగా బలహీనపరుస్తుంది. ఈ ఆకు కూరను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆస్తియోపొరోసిస్ అనే వ్యాధి రాకుండా చేస్తుంది.మరోవైపు, మెగ్నీషియం ఎముక కణాల పెరుగుదలను, మరియు కండరాల బలానికి ఉపయోగపడుతుంది.మెగ్నీషియం తక్కువగా తీసుకోవడం ద్వారా అస్థిపంజర ఆరోగ్యాన్ని పరోక్షంగా ప్రభావితం చేస్తుంది.ఈ రెండు ఖనిజాలను తగినంతగా తీసుకోవడం వల్ల మొత్తం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వృద్ధాప్యం నుండి వచ్చే సమస్యలను నివారించవచ్చు.