Health Benefits : ఈ ఆకుకూర తిన్నారంటే.. వద్దన్నా లాభాలే లాభాలు..!

Health Benefits : ప్రకృతి ప్రసాదించిన అన్ని మొక్కలు కూడా మనకు ఏదో రకంగా ఏదో ఒక విషయంలో ఉపయోగపడుతూ ఉంటాయి. ముఖ్యంగా అలాంటి వాటిలో ఆకుకూరలు మొదటి పాత్ర పోషిస్తాయి. ఇక ఆకుకూరలను మనం సంపూర్ణంగా ఉపయోగించుకుంటే మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇకపోతే మనలో చాలామంది ఆకుకూరలను తినడానికి ఇష్టపడరు. ఇక వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిసినా సరే ఆకుకూరలు తినడానికి ఎబ్బెట్టుగా భావిస్తూ ఉంటారు. కానీ ఆకుకూరలు తినడం వల్ల కొన్ని రకాల వ్యాధులు దూరం అవుతాయి అంతేకాదు మనలో రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి వైరస్ నుంచి అయినా మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు.

అవిసె ఆకు కూర : ముఖ్యంగా ఈ ఆకుకూర ఎరుపు మరియు తెలుపు రంగులలో లభ్యమవుతుంది. అయితే దీని యొక్క పువ్వులను బట్టి మీరు ఆకుకూరను గుర్తుపట్టవచ్చు. ముఖ్యంగా చర్మం మీద గాయాలు , దెబ్బలు తగిలినప్పుడు.. ఈ ఆకులను మెత్తగా నూరి ఆ రసాన్ని చర్మంపై దెబ్బలు ఉన్నచోట రాయడం వల్ల మంచి మందులా పని చేస్తుంది. ఇక ఎవరైనా సరే ఉపవాసం లాంటివి చేసినప్పుడు ఈ ఆకుకూరను తప్పనిసరిగా తినాలి. ఉపవాసం వల్ల వచ్చిన నీరసాన్ని ఇది చాలా బాగా పోగొడుతుంది. ఇక జలుబు , దగ్గు ఉన్నప్పుడు అవిసే ఆకుల రసాన్ని కొన్ని చుక్కల చొప్పున ముక్కులో వేసుకుంటే తలనొప్పి కూడా దూరం అవుతుంది.

Health Benefits Of eat this Leafs curry vegetable In Telugu
Health Benefits Of eat this Leafs curry vegetable In Telugu

ఇకపోతే లోపల నుంచి జలుబు నీరు బయటకి వచ్చి తలనొప్పి బరువు కూడా తగ్గిపోతుంది .అయితే చిన్న పిల్లలకు ఈ ఆకుల రసంలో తేనె కలిపి వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా అవిసె ఆకు, మిరియాలు కలిపి నూరి రసం పిండి ఆ రసాన్ని ముక్కులో వేస్తే అపస్మారంలో ఉన్న వ్యక్తి కూడా కోలుకుంటాడు. ఇక చిన్నపిల్లల్లో వచ్చే బాల పాప చిన్నే లకు ఇది అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. క్రిమి రహితం అయ్యి శరీరంలోని మలిన పదార్థాలు కూడా దూరం అవుతాయి. ముఖ్యంగా శరీరంలో పేరుకుపోయిన మలపదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. ఇక ఈ ఆకుల రసం టాన్సిల్స్ కి పోస్తే అవి వెంటనే కరిగిపోతాయి. రే చీకటి ఉన్నవారు అవిసె ఆకుల కూర తినడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఆకుల నుంచి తీసిన రసాన్ని తాగడం వల్ల రేచీకటి పూర్తిగా తగ్గిపోతుందని చెప్పవచ్చు