Health Benefits : కొన్ని పండ్లు మార్కెట్లో సీజన్ తో సంబంధం లేకుండా సంవత్సరం అంతా ఈజీగా లభిస్తుంటాయి.వాటిలో ఒకటి బొప్పాయి పండు కూడా. ఈ పండును తినడానికి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇది రుచికే కాక, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇది అజీర్తి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. కానీ కొంతమంది మాత్రం బొప్పాయి పండు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే వారి అనారోగ్య సమస్యలను ఇంకా పెంచుతుంది. వీటిని తీసుకుంటే ఆరోగ్యం కంటే…హానికరమే ఎక్కువగా ఉంటుంది. అయితే బొప్పాయి పండును ఎవరు తినకూడదు…ఎవరు తినాలో ఇప్పుడు చూద్దాం..
గర్భిణీ స్త్రీలు : గర్భం దాల్చిన సమయంలో సరైన ఆహారం తీసుకుంటేనే తల్లి బిడ్డల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పౌష్టికాహారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ కడుపుతో వున్నప్పుడు బొప్పాయిని అస్సలు తినకూడదని వైద్యులు సూచిస్తుంటారు. ఎందుకంటే బొప్పాయి తీసుకోవడం వల్ల నెలలు నిండకుండానే బిడ్డ పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే కాక తల్లికి బిడ్డకు వున్న బందంగా వున్న బొడ్డు తాడు బలహీనంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయి పూర్తిగా మాగిన తర్వాత కొంచెం తిన్నా పర్వాలేదు కానీ, పచ్చి బొప్పాయిని అస్సలు తినకూడదు.
గుండె జబ్బులు ఉన్నవారు : బొప్పాయి పండు..గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ గుండె సమస్యల తో బాధపడే వారు ఈ పండును తినకూడదు. బొప్పాయిలో ఉండే ఒక రకమైన అమైనో ఆమ్లం ఉండడం వల్ల,ఇది గుండెకు చాలా హాని కలిగిస్తుంది.హైపోథైరాయిడిజంతో బాధపడేవారు కూడా ఈ పండు అస్సలు తినకూడదు.
అలెర్జీ : కొంతమంది ఏవైనా అలర్జీ సమస్యలు బాధపడుతుంటారు. అలాంటివారు బొప్పాయి తింటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు, కళ్ల నుంచి నీరు కారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటివారు దీనికి దూరంగా ఉండటం మంచిది.
కిడ్నీల్లో రాళ్లు ఉన్నవాళ్లు : బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉన్న పండు. రోగనిరోధకశక్తిని కూడా పెంచుతుంది. ఈ పండు తింటే కిడ్నీరాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు.. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు బొప్పాయి తినకూడదు. కొందరికి గుండె కొట్టుకునే వేగం పెరగుతుంది.కొంతమందికి వణుకు, మానసిక గందరగోళం వంటి సమస్యలు తలెత్తుతాయి.కావున ఇలాంటి వారు బొప్పాయి అస్సలు తినకూడదు.