Health Benefits : రోడ్డుమీద ఎక్కడైనా ఈ మొక్క కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకోండి.. అంత గొప్ప మొక్క ఇది!

Health Benefits : మన ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలున్న మొక్కల్లో కామంచి మొక్క కూడా ఒకటి. ఈ మొక్క మనకు చాలా విరివిగా కనిపిస్తుంది. కామంచి మొక్కకు నలుపు, ఎరుపు రంగుల్లో కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఈ కామంచి మొక్క ఆకులు మిరప చెట్టు ఆకుల లాగా ఉంటాయి. ఈ కామంచి మొక్క ఆకులు, కాండం, పండ్లు అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఈ కామంచి మొక్క ఆకుల రసాన్ని చర్మ సంబంధ సమస్యలకు లేపనంగా వాడుతారు. ఈ కామంచి మొక్క మనకు ఫైల్స్ ని తగ్గించడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కామంచి మొక్క ఆకులను కూరగా చేసుకుని తింటే త్రీ దోషాలు హరిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడేవారు ఈ కామంచి మొక్క పండ్లను సేకరించినీడలో ఎండబెట్టి పొడిగా చేయాలి.

వస్త్రంలో ఈ పొడిని వేసి జల్లించి నిల్వ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ పొడిని రోజు భోజనం తర్వాత తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఆయాసం, శ్వాస సరిగ్గా ఆడక పోవడం, వంటి ఇతర శ్వాస సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. సంతాన సమస్యలతో బాధపడే స్త్రీలు రుతు స్నానం చేసిన తర్వాత పుష్యమి నక్షత్రం రోజున ఈ మొక్క సమూల రసాన్ని తాగడం వల్ల గర్భాశయం శుద్ధి అయ్యి సంతానలేమి సమస్యలు తగ్గి సంతానం కలిగే అవకాశం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ కామంచి మొక్క ఆకులను కూరగా చేసుకుని తినడం వలన రే చీకటి సమస్య కూడా తగ్గుతుంది. ఈ ఆకులను కూరగా చేసుకుని తినడం వలన పురుషుల్లో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. ఈ మొక్క ఆకుల రసాన్ని చెవిలో వేయడం వల్ల చెవిపోటు తగ్గుతుంది.

Health Benefits Of Black nightshade Plant
Health Benefits Of Black nightshade Plant

కామంచి మొక్క పండ్లను పొడిగా చేసి ఆ పొడితో కషాయాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కషాయానికి తేనెను కలిపి తాగడం వల్ల మధుమేహం, మూత్రం వంటి వ్యాధులు తగ్గుతాయి. ఈ మొక్క లేత ఆకులను ముద్దగా నూరి ఆ పేస్టు లేపనంగా రాయడం వల్ల సొరియాసిస్ తో పాటు ఇతర చర్మ సమస్యలు తగ్గుముఖం పడతాయి. నీ కామంచి మొక్క ఆకులను కూరగా చేసుకుని తినడం వలన జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. గుండె సమస్యలతో బాధపడుతున్న వారు ఈ మొక్క ఆకుల రసాన్ని 10 నుండి 20 ఎమ్మెల్ మోతాదులో ప్రతిరోజు ఉదయం సేవిస్తూ ఉండటం వలన సమస్యలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా మొక్క ఆకుల రసాన్ని తాగడం వలన గుండె సమస్యలతో పాటు, స్త్రీ బహిష్టు సమస్యలు, చర్మ వ్యాధులు, కాలేయ సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.