Health Tips : వేసవికాలంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతుండడంతో దాహం మరియు రుచిని తీర్చడానికి మనిషి ఏదైనా పానీయాలు తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు అలాంటి వాటిలో తీపిగా అలాగే జ్యూసీగా ఉండే పైనాపిల్ కంటే మెరుగైనది ఏదీ లేదు అని చెప్పాలి. ఇది మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడమే కాదు.. ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడే పోషకాలను కూడా అందిస్తుంది.. జీర్ణ క్రియ కు సహాయపడటం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు పైనాపిల్ చాలా చక్కగా పనిచేస్తుంది.
ఇకపోతే వేసవికాలంలో పైనాపిల్ తినడం వల్ల ఎముకల దృఢంగా మారి శరీరం మరింత ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే క్యాల్షియం కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పైనాపిల్లో ఉండే మాంగనీస్ మరియు కాల్షియం ఎముకలలో వచ్చే అనేక వ్యాధులను న్యాయం చేస్తాయి. వేసవిలో పైనాపిల్ పరిమిత పరిమాణంలోనే తినాలి. లేకపోతే వేడి చేసే ఆస్కారం ఉంది. ఇకపోతే పైనాపిల్ తినడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు వేగంగా కరుగుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటు జీవక్రియను పెంచుతుంది.
వేసవిలో తరచుగా వాంతులు వస్తూ ఉంటే.. పైనాపిల్ వినియోగం ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు మోషన్స్ సిక్ నెస్ ను దూరం చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ అనాస పండు వికారంలో మీకు మేలు చేస్తుంది. ఇక రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే పీచు కొలెస్ట్రాల్ ని తగ్గించి.. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని ఉపయోగం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి ఊబకాయం నుండి ఉపశమనం కలిగిస్తుంది.