Health Benefits : కంట్లో ఏదయినా నలత పడగానే అమ్మో అంటూ డాక్టర్ ని సంప్రదిస్తారు.సాధారణంగా ఇదే కాక అనేక కంటి సమస్యలకు వైద్యులు కూడా కంటి చుక్కలను సూచిస్తారు. కంటి ఇన్ఫెక్షన్లు, కంటి గాయాలు లేదా గ్లాకోమా వంటి సమస్యలకు చికిత్స చేయడానికి వైద్యనిపుణులు కంటి చుక్కలను ఉపయోగిస్తారు. మాములుగా వర్షాకాలంలో కంటి సమస్యలు అధికంగా వస్తుంటాయి.ఇది కాకుండా, కళ్ళు పొడిబారడం లేదా ఎరుపు కళ్ళు కోసం కూడా వైద్యులు కంటి చుక్కలు మందును ఇస్తారు. అయితే కొంతమంది ఎంత మోతాదులో వేసుకోవాలో తెలియక ఎప్పుడంటే అప్పుడు చుక్కల మందు వేసుకొని అనేక కంటి సమస్యలు కొని తెచుకుంటూ ఉంటారు. మన శరీరంలో అతిసున్నితమైన భాగం కళ్ళు. కళ్ళను అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి కంటి చుక్కలు వేసుకొనేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Health Benefits : చుక్కలు మందు కళ్ళలో వేసుకొనే ముందు మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి.
చుక్కల మందు తెరవడానికి ముందు సీసా పై గడువు తేదీని జాగ్రత్తగా పరిశీలించి గడువులోగా మాత్రమే వాడుకోవాలి. ఒక్కోసారి కంటి సమస్యను బట్టి వైద్యుడు రెండు రకాల చుక్కలు మందులను సూచిస్తుంటారు.అలాంటప్పుడు వైద్యుని సలహా మేరకుఏ బాటిల్ లో మందు ముందుగా ఉపయోగించాలో తెలుసుకొని జాగ్రత్త గా వాడవలసివుంటుంది.కంటి చుక్కలు మందు మరియు ఆయింట్ మెంట్ రెండింటినీ డాక్టర్ సూచిస్తే అప్పుడు ముందుగా ఐ డ్రాప్ ఉపయోగించి కనీసం 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాత ఆయింట్ మెంట్ రాసుకోవాలి. అప్పుడే కంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి.
Health Benefits : కంటి చుక్కలను ఉపయోగించినప్పుడు ఎలా చేయకూడదో ఇప్పుడు చూద్దాం :
చుక్కలమందు బాటిల్ ని శుభ్రంగా ఉండి అతి వేడి, చల్లదనం లేని ప్రదేశాల్లో ఉంచాలి.బాటిల్ క్యాప్ తీసేటప్పుడు దాని కొనను తాకకూడదు. వాడిన తర్వాత మూత తీసివేసి గాలి తగిలేలా ఉంచకూడదు. డాక్టర్ ఒకరికి ఇచ్చిన కంటి చుక్కల మందును వేరేవారికి ఉపయోగపడదు.మనం వాడే చుక్కల మందు సీల్ తీసిన తర్వాత ఒక నెల మాత్రమే వాడుకోవాలి. కొంతమంది కి కంటి చుక్కలను ఉపయోగించిన తర్వాత అవి పడక కళ్ళ నొప్పి, మంట, దురద లేదా పొడిబారడం వంటి దుష్ప్రభావాలు కలిగితే ఆ సమస్యలు 15 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే, తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. బయటకు వెళ్ళినప్పుడు ఎండ, గాలి, పొల్యూషన్ ప్రభావం మన కళ్ళపై పడకుండా స్కార్ఫ్ కట్టుకోవడం కానీ, అద్దాలు పెట్టుకోవడం వల్ల దుమ్ము దూళిరేణువు లు కళ్ళ లో పడకుండా కాపాడుతాయి.