Moringa Leaves : ప్రకృతి సంపద లో మునగాకు ఒకటి.. మునగ కాయలు కూరలలో, పులుసు లో తరచూ వాడుతుంటాం.. కాకపోతే మునగాకును తినడానికి ఎవరు ఎక్కువ ఆసక్తి చూపరు.. మునగాకు లో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా మునగాకును వాడతారు..!!
మునగ ఆకుల రసం ఉదయం పరగడుపున తాగితే కిలోలకు కిలోలు బరువు తగ్గుతారు. శరీరంలో పేరుకున్న విషపదార్థాలను బయటకు తొలగిస్తుంది. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. మునగాకు రసం కొద్దిగా మిరియాల పొడి వేసి కణతల పైన రాసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. మునగాకు రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే తల తిరగడం, మొలలు, ఎక్కిళ్ళు, అజీర్ణం, ఆహారం జీర్ణం కావడం వంటి సమస్యలు తగ్గుతాయి.

మునగాకు రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం పైన మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. మునగాకు రసంలో నువ్వుల నూనె సమాన మోతాదులో తీసుకుని నూనె మాత్రమే మిగిలి వరకు మరిగించాలి. తరువాత నూనెను వడపోసుకొని గజ్జి, దురద , తామర ఉన్నచోట రాసుకుంటే చర్మ సమస్యలు తగ్గిపోతాయి. మునగ ఆకులను వేడి చేసి బెణుకుల, వాపులు, నొప్పులు వున్నచోట వేసి కట్టుకడితే ఆ నొప్పులు త్వరగా తగ్గిపోతాయి.