Health Benefits : కొత్తిమీర గురించి ఈ విషయాలు మీకు తెలుసా..!?

Health Benefits : సాధారణంగా కొత్తిమీరను వంటలకు అలంకరణగా మాత్రమే అనుకుంటారు.. కానీ వంటకు రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుందని.. అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు.. కొత్తిమీర లేకపోయినా పర్వాలేదులే అసలు వేస్తే ఏంటి వేయకపోతే ఏంటంట అనుకునేవారు మరికొందరు..! కొత్తిమీర ప్రయోజనాల గురించి తెలుసుకుంటే.. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి రోజూ ప్రతి వంటలలో ఉపయోగిస్తారు..!!కొత్తిమీర విటమిన్ ఎ, బి, సి, ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి.

ప్రతిరోజు 30 గ్రాముల కొత్తిమీరను మనం తీసుకుంటే 547 శాతం విటమిన్లు మన శరీరానికి అందుతుంది. ఇందులో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మినరల్స్ కూడా మనకు లభిస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఎముకలు పెళుసుగా మారకుండా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందించడం తోపాటు గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంటుంది. చాలామంది నిమ్మజాతి పండ్లలో, సిట్రస్ పండ్లలో మాత్రమే విటమిన్ సి లభిస్తుంది అనుకుంటారు

Health Benefits in Coriander
Health Benefits in Coriander

కానీ కొత్తిమీరలో కూడా ఎక్కువగా విటమిన్ సి లభిస్తుంది.కొత్తిమీరలో లూటిన్, జియా జానతిన్, కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ళలోని రెటీనాను సంరక్షిస్తాయి. రెటీనా దెబ్బతినకుండా కాపాడతాయి. వయసు మీద పడటం వల్ల వచ్చే అంధత్వము అడ్డుకుంటాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. కంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. చర్మాన్ని సంరక్షించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. అధిక రక్తపోటుకు చెక్ పెడుతుంది.