Health Benefits : ఈ చెట్టు ఆకులు ఆరోగ్యానికి మంచిదా.!?

Health Benefits :  పల్లెటూర్లలో మర్రిచెట్టు ఎక్కడ పడితే అక్కడ కనువిందు చేస్తాయి.. అదే పట్టణాలలో ఇవి కనిపించడమే అరుదు.. మర్రిచెట్టు ఆకుల నుంచి వేల వరకు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది అందుకే ఆయుర్వేద వైద్యంలో మర్రిచెట్టు ఆకులు విశేషమైన స్థానం ఉంది ఈ చెట్టు ఆకులతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..!లేత మర్రి చెట్టు ఆకులను తీసుకుని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని నిల్వచేసుకుని ప్రతిరోజు ఉపయోగించుకోవచ్చు.

రెండు గ్లాసుల నీటిలో ఒక చెంచా మర్రిచెట్టు ఆకులు పొడి వేసి బాగా మరిగించాలి. ఈ నీరు సగం అయ్యే దాకా మరిగించి ఆ నీటిని వడపోసుకొవలి. ఈ కషాయం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, పడిశం, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ కషాయం తాగితే మన శరీరంలో ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది. ఫైల్ సమస్యను దూరం చేస్తుంది శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేయడం తోపాటు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

health benefits in Banyan Tree
health benefits in Banyan Tree

మర్రి ఆకుల కషాయం తాగితే పురుషులలో అపరిమితమైన వీర్యవృద్ధి కలుగుతుంది. సంతాన సమస్యలను దూరం చేస్తుంది. మర్రి ఆకుల పొడిలో సమానంగా చక్కెర కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం అరచెంచా మోతాదులో తీసుకుని ఒక గ్లాసు నీటిలో కలిపి తీసుకుంటే.. స్త్రీలలో వచ్చే రుతుక్రమ దోషాలు తొలగిపోతాయి. పీరియడ్స్ సమయంలో వచ్చే నీరసం, అలసట, చికాకు తొలగిస్తుంది.