Health Benefits : అతిబల మొక్క తో రోగాలన్నీ పరార్.!

Health Benefits : పల్లెటూర్లలో అలాగే పట్టణాలలో కూడా రోడ్ సైడ్ పిచ్చిమొక్కలు గా పుట్టలుగుట్టలుగా పెరుగుతూ ఉంటాయి మొక్కలు.. ఈ మొక్కలను అందరూ పిచ్చి మొక్కలు అనుకుంటూ ఉంటారు.. ఇకపోతే వీటి ఉపయోగాలు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. దీనిని కొన్ని ప్రదేశాలలో దువ్వెన బెండ మొక్క , తుత్తుర బెండ అని కూడా పిలుస్తూ ఉంటారు. వేసవి ప్రాంతాలలో ఎక్కువగా జీవించే ఈ మొక్కల నుంచి లభించే వేర్లు, పువ్వు , బెరడు, ఆకులు, విత్తనం, కాండం ఇలా అన్నీ కూడా మనకు మంచి ప్రయోజనాలను అందిస్తాయి.ఇక ఈ ముక్కలలో వుండే పోషకాలు..

మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జేసిక్, , హెపాటోప్రొటెక్టివ్, ఇమ్యూనోమోడ్యూలేటరీ,మూత్ర విసర్జన యాంటి హై పెర్లిపిడెమిక్, హైపోగ్లైసీమిక్, యాంటీ మైక్రోబయాల్, యాంటీ మలేరియా, గాయాలు నయం చేయడమే కాక విరేచనాలు తగ్గించడంలో చాలా సమర్థవంతంగా సహాయపడుతాయి. తుత్తురు బెండ ఆకులను ముద్దగా చేసి, పిచ్చి కుక్క కరిచిన చోట.. ఆ పేస్ట్ ను రక్తం కారుతున్న చోట పెట్టి గట్టిగా కట్టడం వలన విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. పిచ్చికుక్క కరిచిన వెంటనే తుత్తురు బెండ యొక్క ఆకురసం 70 గ్రా మొతాదులో తాగించాలి. ఇలా చేస్తుంటే విషం విరిగి, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

Health Benefits in Atibala Plant Uses
Health Benefits in Atibala Plant Uses

అంతేకాదు జ్వరం, నోటి పూత , దగ్గు, పొడి దగ్గు , మూత్రాశయం,కంటి శుక్లం , సిఫిలిస్, గర్భాశయ స్థాన భ్రంశం, విరేచనాలు, పాము కాటు , కాళ్ల నొప్పులు, పైల్స్, గనేరియా, రక్త స్రావం, సెప్టిసిమియా, కుష్టు, బ్రోన్కైటిస్ వంటి వ్యాధులను తగ్గించడానికి ఈ తుత్తుర బెండు చక్కగా సహాయ పడుతుంది. ఆయుర్వేదం ప్రకారం, వాత దోష యొక్క అధిక తీవ్రత వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి కారణం అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో సమస్యను తగ్గించడానికి ఈ తుత్తుర బెండ ఆకు చాలా బాగా పనిచేస్తుంది.తుత్తురు బెండ ఆకులను తేనె లేదా గోరువెచ్చని నీటితో కూడా కలిపి తీసుకోవచ్చు అలాగే మగవారిలో సామర్థ్యాన్ని పెంచడానికి ఈ తుత్తుర బెండ చక్కగా పనిచేస్తుంది.