Health Benefits : ఈ ఐదు పళ్లలో ఒక్కపండు తినండి చాలు .. మీ ఆస్తమా మటుమాయం !

Health Benefits : కొవిడ్ తరువాత చాలా మంది ఊపిరితిత్తుల‌కు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే కోవిడ్ కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. తొలుతన తేలికపాటి కఠిన కోవిడ్ బారిన పడి కోలుకున్నవారు సైతం తరువాత రోజుల్లో శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాయుకాలుష్యం వల్ల రకరకాల వ్యాధులు ఉపిరితిత్తులను ఆనారోగ్యానికి గురి చేస్తున్నాయి. వీటిలో ఆస్తమా సమస్య సర్వసాధారణం. కాలుష్యం కారణంగా తీవ్ర‌మైన దగ్గు, చాలా రకాల సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. అయితే, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి 5 రకాల ఆహారాలను నిపుణులు సూచించారు.

వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఊపిరిత్తులకు సంబంధించిన సమస్యలతో పాటుగా ఇతర అనారోగ్య సమస్యలు దరిచేరవు. రోజూ ఒక యాపిల్ తినడం వలన వైద్యులకు దూరంగా ఉండవచ్చు. యాపిల్ శరీరానికి చాలా ప్రయోజనాన్ని అందిస్తుంది. యాపిల్ లో ఉండే ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్య సంరక్షణలో అద్భుతంగా పని చేస్తాయి. ఆపిల్ తినడం వలన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఆస్త‌మా రోగులు రోజూ ఒక యాపిల్‌ను తినాలి. మార్కెట్లో అనేక రకాలైన పండ్లు లభిస్తాయి. బెర్రీస్‌, పీచెస్ కూడా ఏడాది మొత్తం మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ప్రతి రోజూ ఆహారంలో వీటిని చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Health Benefits Asthma of Eat This fruits
Health Benefits Asthma of Eat This fruits

3. జామ : మన దేశంలో ఏడాది పొడవునా చౌకగా లభించే పండు జామ‌. జామపండులో విటమిన్ సి ఉంటుంది. అందుకే జామ శరీరానికి ఎంతో మేలును కలుగజేస్తుంది. ఆస్తమా సమస్య ఉన్నవారు ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక జామపండు తింటే తేడా కనిపిస్తుంది. జాములో ఫ్లేవినాయిడ్స్ ఉంటాయి.

4. ఉసిరి: ఉసిరిలో విటమిన్ సి అధిక మోతాదులో ఉంటుంది. ఇది లంగ్స్ సమస్యను నివారిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. రోజూ ఉసిరికాయ రసం తాగడం ”వలన మంచి జరుగుతుంది.

5. బత్తాయిలు : యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ విటమిన్ సి. కూడా ఉంటాయి. ప్రతిరోజూ ఒక బత్తాయిని తినడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బత్తాయి రసం రోజూ తాగడం వలన అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చు.