Nela Thangedu : ప్రకృతి ప్రసాదించిన వరప్రదాయిని ఈ మొక్క..!!

Nela Thangedu: నేల తంగేడు మొక్కను మనం నిత్యం మన ఇంటి పరిసరాల్లో చూస్తూనే ఉంటాం.. అయితే ఈ మొక్కలో ఔషధ గుణాలు ఉన్నాయని.. మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని అతికొద్ది మాత్రమే తెలుసు.. నేల తంగేడు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..!నేల తంగేడు పొడిని ప్రతిరోజు తీసుకుంటే డయాబెటిక్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. పటిక బెల్లం లో నేల తంగేడు పొడిని కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

పాలలో ఈ పొడిని కలిపి తీసుకుంటే నేత్ర సమస్యలు రాకుండా చేస్తుంది. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. అంతేకాకుండా శృంగార సమస్యలకు చెక్ పెడుతుంది. నేల తంగేడు పొడి లో ఎండు ఖర్జూరం పొడి కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. అదే పాత బెల్లం లో ఈ పొడి కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

Health And Beauty Benefits Of Nela Thangedu
Health And Beauty Benefits Of Nela Thangedu

గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట,అజీర్తి వంటి ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.తేనె తో నేల తంగేడు పొడిని కలిపి తీసుకుంటే శరీరానికి బలాన్ని అందిస్తుంది. శరీర పుష్టి లభిస్తుంది. పిల్లలకు ఈ చూర్ణాన్ని అందిస్తే పిల్లలు చక్కగా ఎదుగుతారు. పంచదార, ఆవు నెయ్యి, నేల తంగేడు పొడిని కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి ప్రవేశించిన చెడు బ్యాక్టీరియాను నశింపచేస్తుంది.