TEA : ఈ రకాల టీ లను ఎప్పుడైనా ట్రై చేశారా..?

TEA : ఎవరికైనా సరే ఉదయం లేచింది మొదలు గొంతులో ఒక చుక్క టీ పడనిదే ఎవరికి రోజు ప్రారంభం కాదు అని చెప్పవచ్చు. అందుకే భారత దేశంలో ఎక్కువ మంది టీ, కాఫీలకు బాగా అలవాటు పడిపోయారు. ముఖ్యంగా 2019 వ సంవత్సరం లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మే 21వ తేదీని అంతర్జాతీయ టీ డే గా కూడా గుర్తించడం జరిగింది. ఇకపోతే టీని తాగడం వల్ల అనారోగ్య అని తగ్గించుకోవచ్చని అందుకే చాలామంది ఇలా టీ తాగుతూ ఉంటారని ఒక అధ్యయనంలో వెల్లడైంది.టీ తాగడం వల్ల కేవలం ఆకలి మాత్రమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

Have you ever tried this type of tea
Have you ever tried this type of tea

1. అల్లం టీ : ముఖ్యంగా శీతాకాలంలో గొంతు నొప్పి , జ్వరం, తలనొప్పి, జలుబుతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అల్లం తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ప్రతి రోజు మూడు సార్లు తాగితే వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే రోజుకు నాలుగు సార్లు కంటే ఎక్కువ ఈ టీ తాగితే అల్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆస్తమా, దగ్గు లాంటి సమస్యలు తగ్గించుకోవాలంటే అల్లం టీ తో పాటు తేనె కూడా కలిపి తీసుకోవాలి.

2. మందారం టీ : అధిక రక్తపోటును నియంత్రించడానికి మందారం టీ చాలా చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా మందార పువ్వులతో తయారు చేసే టీ తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ప్రతిరోజు రెండు కప్పులు మందారం టీ తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగి పోతుంది. గుండె సంబంధిత సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు.

3. బాదం టీ : దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేయడంలో బాదం చాలా చక్కగా పనిచేస్తుంది. బాదం టీ తాగడం వల్ల మీ చర్మం పై ఉన్న ముడతలు కూడా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఇ వంటివి చర్మ సౌందర్యానికి బాగా పనిచేస్తాయి. గుండె జబ్బులను కూడా దూరం చేసుకోవచ్చు.